బిజినెస్

మదుపరుల సంపద రూ.7లక్షల కోట్లు ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 31: ఈ ఆర్థిక సంవత్సరంలో బిఎస్‌ఇ సెనె్సక్స్ గత ఏడాదితో పోలిస్తే 9.36 శాతం పతనమైంది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సెనె్సక్స్ ఇంతగా పతనమవడం ఇదే మొదటిసారి. ఫలితంగా మదుపరులు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు ఈ ఏడాది దేశీయ మార్కెట్లను దెబ్బ తీశాయి. అయితే ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం నాడు సెనె్సక్స్ 3.26 పాయింట్ల స్వల్పలాభంతో 25,341.86 పాయింట్ల వద్ద ముగిసింది.
అయితే మార్చి నెలలో సెనె్సక్స్ 10.17 శాతం అంటే 2,339 పాయింట్లు పెరిగింది. అలాగే నిఫ్టీ సైతం 10.75 శాతం లేదా 751.35 పాయింట్లు పెరిగింది. గత నాలుగేళ్లలో ఒక్క నెలలో ఈ రెండు సూచీలు ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కొన్ని కమోడిటీల ధరలు భారీగా పతనం కావడం, దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ తొలిసారి వడ్డీ రేటు పెంచడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కీలకమైన దేశీయ సంస్కరణల అమలులో ఆలస్యం లాంటి ప్రతికూల పరిణామాలు ఈ ఆర్థిక సంవత్సరంలో సెనె్సక్స్ 2,615.63 పాయింట్లు లేదా 9.36 శాతం పతనానికి కారణమైనాయి. 2011-12 ఆర్థిక సంవత్సరం తర్వాత సెనె్సక్స్ ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఫలితంగా మదుపరుల సంపద సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అంటే ఒక్కో ట్రేడింగ్ సెషన్‌కు రూ 2,700 కోట్లు ఆవిరైంది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో 752.60 పాయింట్లు లేదా 9.72 శాతం పతనమై 7,738 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం డాలరుతో రూపాయి విలువ కూడా 3 రూపాయల 61 పైసలు నష్టపోయింది.
కాగా, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 141 పాయింట్ల దాకా పెరిగిన సెనె్సక్స్ ఆ తర్వాత ప్రారంభ లాభాలన్నిటినీ కోల్పోయి నెగెటివ్ జోన్‌లోకి జారుకోవడమే కాకుండా ఒక దశలో 25,223.22 పాయింట్ల కనిష్టస్థాయికి చేరుకుంది. అయితే చివర్లో తిరిగి పుంజుకుని 3.28 పాయింట్ల లాభంతో 25,341.86 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ బుధవారం భారీగా 438.12 పాయింట్లు పెరగడం తెలిసిందే. 7777.60-7702 పాయింట్ల మధ్య ఊగిస లాడిన నిఫ్టీ సైతం చివరికి 3.20 పాయింట్ల లాభంతో 7738.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. కంపెనీల వారీగా చూసినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరం గతంలో ఎన్నడూ లేనంతగా రూ.10,141 కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని హిందుస్థాన్ జింక్ ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేరు గరిష్ఠంగా 4.77 శాతం పెరిగింది. అలాగే అమెరికాలోని సేవ్ మార్ట్ ఫార్మసీ స్టోర్ల విక్రయానికి నాట్కో ఫార్మా కంపెనీ బోర్డు ఆమోదం తెలపడంతో ఆ కంపెనీ షేరు కూడా 4 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా విదేశీయులు బుధవారం నాడు 1442.47 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు ప్రాథమిక గణాంకాలను బట్టి తెలుస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, తైవాన్ సూచీలు లాభాల్లో ముగియగా, సింగపూర్, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రధాన ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంనుంచే నష్టాల్లో కొనసాగాయి. ఇదిలా ఉండగా ఇటీవలే తన 70 కోట్ల రూపాయల ఐపిఓను పూర్తి చేసుకున్న మహారాష్టక్రు చెందిన భారత్ వైర్ రోప్స్ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లలో శుక్రవారంనుంచి లిస్టింగ్ కానున్నాయి. ఈ ఏడాది ఐపిఓలకు వచ్చిన కంపెనీల్లో ఇది ఐదవది.