బిజినెస్

సరికొత్త గరిష్ట స్థాయి లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 18: విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు సాగుతోంది. సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ బుధవారం సైతం సరికొత్త రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఐటీసీ భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే లాభాల పరుగుతీసింది. ఇంట్రాడేలో ఓ దశలో అత్యధిక రికార్డు స్థాయి 41,614.77 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరికి 206.40 పాయింట్లు (0.50 శాతం) లాభపడి ఆల్‌టైం ముగింపు గరిష్ట స్థాయి 41,558.57 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 56.65 పాయింట్లు (0.47 శాతం) ఆధిక్యతతో రికార్డు ముగింపు గరిష్టం స్థాయి 12,221.65 పాయింట్ల ఎగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎం అండ్ ఎం అత్యధికంగా 3.37 శాతం లాభపడింది. అలాగే సన్‌పార్మా 2.53 శాతం, ఏసియన్ పెయింట్స్ 1.88 శాతం, ఐటీసీ 1.66 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.58 శాతం, టెక్ మహీంద్రా 1.51 శాతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపుటాటామోటార్స్ తీవ్రంగా 3.05 శాతం నష్టాలను చవిచూసింది. ఇందుకు కారణం జాతీయ కంపెనీ చట్టాల అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిర్ణయమేనని విశే్లషకులు భావిస్తున్నారు. గత ఏడాది నాటకీయంగా తొలగింపునకు గురైన సైరస్ మిస్ర్తిని టాటాసన్స్‌కు కార్యనిర్వాహక చైర్మన్‌గా నియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ పదవిలో ఎన్. చంద్రశేఖరన్‌ను నియమించడం చట్టబద్ధం కాదని ఎన్‌సీఎల్‌టీ తేల్చింది. ఈక్రమంలో టాటాపవర్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజెస్ వంటి ఇతర టాటాగ్రూప్ సంస్థల స్టాక్స్ సైతం భారీగా 4.14 శాతం నష్టపోయాయి. ఈ కారణంగా స్టాక్‌మార్కెట్ల భారీ లాభాలకు అడ్డుకట్ట పడింది. ఇక సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్‌బీఐ, యెస్‌బ్యాంక్ సైతం 1.79 శాతం నష్టపోయాయి. అలాగే ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ సైతం నష్టాలను సంతరించుకున్నాయి. కాగా దేశీయ స్టాక్ మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు పెద్దయెత్తున తరలివస్తున్నాయి. గడచిన మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 728.13 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు 796.38 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు.
క్షీణించిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం 6 పైసలు క్షీణించింది. ఇంట్రాడేలో 71.05గా టేడైంది. ఇక ఆసియా దేశాల మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తాజాగా 0.76 శాతం తగ్గాయి. బ్యారెల్ 65.58 వంతున ట్రేడైంది.