బిజినెస్

మళ్లీ సరికొత్త జీవన కాల గరిష్ట స్థాయి లాభాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 19: వరుసగా మూడోరోజైన గురువారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయి లాభాలను నమోదు చేశాయి. విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధన, ఐటీ, వాహన కౌంటర్లలో భారీగా వాటాల కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే లాభాల ర్యాలీ తీసి 115.35 పాయింట్లు (0.28 శాతం) లాభపడి సరికొత్త ముగింపు గరిష్టం 41,673.92 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 38.05 పాయింట్లు (0.31 శాతం) ఆధిక్యతతో 12,259.70 పాయింట్ల సరికొత్త ఆధిక్యత వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 6.74 శాతం లాభపడింది. అదేబాటలో టీసీఎస్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, ఆర్‌ఐఎల్ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌పార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 2.26 శాతం నష్టపోయాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ అభిశంసన వార్తలు ఉదయం వెలువడడంతో మదుపర్లు తొలుత ఆచితూచి అడుగేశారు. ఐతే తర్వాత విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగడంతో సూచీలు లాభాల పరుగందుకుని సరికొత్త రికార్డు స్థాయి గరిష్టాలను తాకాయి. ప్రధాన కార్పొరేట్ కంపెనీల మార్కెట్ విలువ సైతం రికార్డు స్థాయికి చేరుకుంది. కాగా వచ్చే బడ్జెట్‌కోసం కసరత్తు చేస్తున్న కేంద్రం ఎలాంటి ఆర్థికాభివృద్థి చర్యలు తీసుకుంటుందన్న విషయంపై సైతం మదుపర్లు దృష్టి నిలిపారని విశే్లషకులు చెబుతున్నారు. సరికొత్త విధానాల ద్వారా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే అవకాశాలే అధికంగా ఉన్నాయన్న విశ్వాసం ప్రస్తుతం మదుపర్లలో కనిపిస్తోంది. అలాగే పన్ను వసూళ్లలో మాంద్యాన్ని తొలగించేందుకు విశేష కృషి జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ సానుకూల స్థితిగతులతో మదుపర్లలో రిస్క్ తీసుకుని మరీ పెట్టుబడులు మదుపు చేసేలా చేస్తోందని, ఇందువల్ల బ్రాడర్ మార్కెట్లలో ద్రవ్య లభ్యత గణనీయంగా పెరుగుతుందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు. ఇక రంగాల వారీగా బీఎస్‌ఈలో టెలికాం, ఇంధన, వాహన, ఐటీ, చమురు సహజవాయువులు, వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎంసీజీ సూచీలు 1.98 శాతం లాభాలను సంతరించుకున్నాయి. పైనాన్స్, కేపిటల్ గూడ్స్, స్థినాస్తి, వినిమయ వస్తువులు, బ్యాంకెక్స్ సూచీలు 0.31 శాతం నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.17 శాతం లాభపడ్డాయి. కాగా విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం నాడు రూ. 1,836.81 కోట్ల విలువైన వాటాలను దేశీయ మార్కెట్లలో కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు 1,267.57 కోట్ల విలువైన వాటాల విక్రయాలకు పాల్పడ్డారు.
క్షీణించిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మార కం విలువ గురువారం 17 పైసలు క్షీణించింది. ఇంట్రాడేలో 71.15గా ట్రేడైంది. ఇక ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ వాణిజ్యంలో నష్టాలను నమోదు చేశాయి. ముడిచమురు ధరలు 0.12 శాతం వృద్ధితో బ్యారెల్ 66.25 డాలర్ల వంతున ట్రేడైంది.