బిజినెస్

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 100%పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశీయ జీవిత బీమా రంగానికి నేరుగా వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది. అలాచేస్తే రూ. 40 వేల నుంచి 60 వేల కోట్ల మూలధనం సమకూరే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు మనదేశానికి చెందిన ప్రైవేటు రంగ బీమా సంస్థలకు రూ. 30 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 26 శాతం నుంచి 49 శాతానికి ప్రైవేటు సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతా న్ని పెంచడమే దోహదం చేసిందని ఆ నిపుణులు చెబుతున్నారు. బీమా నియంత్రణ, అభివృద్థి సం స్థ (ఇడాయ్) నివేదిక మేరకు జీవిత బీమా సంస్థ లు ఇప్పటికే తమ 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇలా ఆటోమేటిక్ గా వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సమీకరణకు ప్రభుత్వ ప్రాథమిక ఆమోదం అవసరం ఉండదు. ఈక్రమంలో గత 2న ఇర్డాయ్ వివిధ బీమా కంపెనీల అభిప్రాయ సేకరణ చేపట్టగా 10వ తేదీకల్లా వెల్లడించాలని సూచించి మేరకు సమీకరించింది.