బిజినెస్

వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశంలో అన్ని రంగాల్లోకి ఐటీ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగులు పనిచేస్తుండగా, బెంగళూరు అత్యధిక వేతానాలు చెల్లిస్తున్న నగరంగా అగ్ర స్థానం లో కొనసాగుతోంది. ఈమేరకు ‘రాండ్‌స్టాడ్ ఇన్‌సైట్స్ సేలరీ ట్రెండ్స్ 2019’ పేరిట అధ్యయన నివేదిక గురువారం వెలువడింది. ఈ నగరంలో కంపెనీలు జూనియర్ స్థాయిలోనే నైపుణ్యానికి వెచ్చిస్తున్న వార్షిక ఖర్చు రూ. 5.27 లక్షలు కాగా, మధ్యస్థ స్థాయిలో 16.45 లక్షలు, సీనియర్ స్థాయిలో రూ.35.45 లక్షలుగా ఉంది. ఇలా ఈ నగరం అత్యదిక జీతభత్యాల చెల్లింపు విషయం లో 2017 నుంచి వరుసగా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో (రూ. 5లక్షలతో) హైదరాబాద్, మూడో స్థానంలో ముంబయి (రూ. 4.59 లక్షలతో) నిలిచింది. అలాగే మధ్యస్థ స్థాయి ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిం చే విషయంలో ముంబయి (రూ. 15.07 లక్షల తో) అగ్ర భాగాన నిలువగా, దేశ రాజధాని ఢిల్లీ (రూ. 14.5 లక్షలతో) ద్వితీయ స్థానంలో ఉంది. అలాగే సీనియర్లకు అత్యధిక వేతనాలు చెల్లించే నగరంగా సైతం (రూ. 33.95 లక్షల వార్షిక వేతనంతో) ముంబయి నగరం అగ్ర భాగాన నిలిచింది. పూణే (రూ. 32.68 లక్షల వార్షిక వేతనం తో) ద్వితీయ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. కాగా ఐటీ రంగ ఉద్యోగులు అటు జూనియర్, ఇటు సీనియర్ స్థాయిల్లో అత్యధిక వార్షిక వేతనాలు ఆర్జిస్తున్న వారిగా అగ్ర స్థానం లో ఉన్నారు. ప్రత్యేకించి డిజిటల్ మార్కెట్లు సీనియర్ ప్రొఫెషనల్స్‌కు అత్యధిక వేతనాలు అందజేసే స్థాయికి ఎదిగాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ మార్కెట్లలో సీనియర్లకు రూ. 35.65 లక్షల వార్షిక వేతనం వస్తోందని తెలిపింది. ఎప్పటికప్పుడు డిజిటల్ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే వారికి వేతనాలు పెరుతున్నాయని, ప్రత్యేకించి క్లౌడ్, ప్రాడక్టు మేనేజ్‌మెంట్, అనలిటిక్స్, కృత్రిమమేథ, ఆటోమేషన్ వంటి వాటిపై తాజా అవగాహన పెంచుకునే ఉద్యోగులకు అవకాశాలు మెండుగా వున్నాయని ఆ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం జీఎస్టీ కంప్లెయన్స్ స్పెషలిస్ట్‌లు, అకౌంటెంట్లు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది.