బిజినెస్

‘ఎస్‌యూవీ నెక్సన్ ఈవీ’ పేరిట సరికొత్త విద్యుత్ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటామోటార్స్ తొలి విద్యుత్ ‘ఎస్‌యూవీ నెక్సన్ ఈవీ’ కారును గురువారం విడుదల చేసింది. ఈవాహనాన్ని కొన్ని వారాల వ్యవధిలోనే వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. జిప్ట్రాన్ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ వాహనం ఒకసారి చార్జిచేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, 9.9 సెకన్లలో యాగ్జిలరేషన్ ఆరంభమై గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వివరించింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ కారు కొనుగోళ్లకు బుకింగ్స్ ఆరంభిస్తున్నట్టు టాటామోటార్స్ తెలిపింది. అయితే కారు ధరను, డెలివరీ తేదీని మాత్రం ఆ కంపెనీ తెలియజేయలేదు. నెక్సన్‌లోని ఏఎంటీ వెర్షన్ కారుకంటే 20 శాతం అధికంగా ఈ విద్యుత్ కారు ధర ఉంటుందన్న సంకేతాలను మాత్రం ఆ కంపెనీ ఇచ్చింది. దీన్నిబట్టి ఆ కారు ధర రూ. 15 నుంచి 17 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ‘ఎస్‌యూవీ’ దాదాపు 35 ప్రత్యేకతలు కలిగివుంటుందని, ఇందులో ‘దూరంగా లాక్కొని వెళ్లడం, చొరబాట్లు’ వంటి వాటిపై హెచ్చరికలు జారీ చేయడంలాంటివి ఉంటాయి. కాగా మొత్తం మూడు మోడళ్లతో ఈ విద్యుత్ కారు మార్కెట్లోకి రానుంది. దీనికి ఎనిమిదేళ్లు, లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీపై వారంటీ కూడా ఉందని టాటామోటార్స్ సీఈవో, ఎండీ గుయెన్టర్ బుట్స్‌చెక్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటి అత్యధిక స్థాయి వారంటీ ఇప్పటి వరకు పరిశ్రమలో ఏ సంస్థా ఇవ్వలేదన్నారు. అలాగే ఇక్కడి టాటామోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యూనిట్‌కు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న శైలేష్ చంద్ర మాట్లాడుతూ ఈ కారు బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ మోడ్‌తో ఉంటుందని కేవలం 10 నిమిషాల్లో 80 శాతం చార్జి అవుతుందని, 40 నిమిషాల్లో పూర్తిగా చార్జి అవుతుందని వెల్లడించారు. ఒక 15 యాంపియర్ ప్లగ్ పాయింట్‌లో కూడా ఈ బ్యాటరీ చార్జి అవుతుందని తెలిపారు.