బిజినెస్

ఆర్థిక మాంద్యంతో మార్కెట్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: దేశంలో వ్యాపార రంగానికి 2019 గడ్డు పరిస్థితినే మిగిల్చిందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలతో 2020 సంవత్సరంలోనైనా సానుకూలత ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలు అభిప్రాయపడ్డాయి. బలహీనమైన వినియోగదారుల వినియోగం, లిక్విడిటీ క్రంచ్, ఉత్పత్తిలో మందగమనం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 2019లో గడ్డు పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని సెంటనీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తిపిర్నేని శేషగిరిరావు వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచేందుకు, ముఖ్యంగా తయారీ, నిర్మాణం, పన్ను వసూళ్ల అంశంలో ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కనీసం 2020లోనైనా ఆర్థిక ఉద్దీపనపై సానుకూల పెరుగుదల కనబరుస్తుందని ఆశిస్తున్నామని శేషగిరిరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్షిక బడ్జెట్ (2020-21) వ్యాపార రంగానికి ప్రోత్సహకరంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. సత్వర ఆర్థిక కార్యకలాపాలు బలమైన ఆర్థిక చర్యలు ఆశాజనకంగా ఉంటాయని ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. దేశ మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐలో పెరుగుదల ఉండటంతో ఫ్యాక్టరీ కార్యకలాపాలు కొద్దిగా మెరుగు పడ్డాయని సెంచరీ మెట్రెస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని విశే్లషించారు. అయినప్పటికీ కొన్ని సంస్థలు ఇంకా ఉద్యోగాలు తొలగించడం ఆందోళనకరమని, ఇది ప్రోత్సకరమైన సంకేతం కాదన్నారు. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలతో ఫర్నిచర్, పరుపుల పరిశ్రమకు 2019 సవాలుగా మారిందని ఉత్తమ్ మలాని అభిప్రాయపడ్డారు.

''చిత్రాలు.. శేషగిరిరావు, ఉత్తమ్ మలాని