బిజినెస్

ఇక రాత్రి 8 గంటలు దాటితే ఏటీఎంలలో ఓటీపీ విత్‌డ్రాయల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 31: ఏటీఎంలలో జరుగుతున్న అనధికారిక లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) సరికొత్త చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు జరిగే లావాదేవీల్లో రూ.10 వేలకు పైబడిన లావాదేవీలకు ఇకపై వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చినట్టు ఆ బ్యాంకు మంగళవారం నాడిక్కడ ప్రకటించింది. ఈమేరకు ఖాతాదారుడికి సంబంధించిన బ్యాంకులో రిజిస్టర్ కాబడిన ఫోన్ నంబర్‌కు విత్‌డ్రాయల్ సమయంలో ఓటీపీ వస్తుంది. దీన్ని వినియోగించడం ద్వారా ఖాతాదారుడు సురక్షితంగా సొమ్ము విత్‌డ్రా చేసుకోగలుగుతాడు. ఖాతాదారులకు అనధికారిక విత్‌డ్రాయల్స్ ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న ఉదేశ్యంతోనే ఈ ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఎస్‌బీఐ తెలిపింది. 2020 జనవరి 1 నుంచే ఈ ఓటీపీ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు తెలిపింది.
ఇందుకు సంబంధించి ఖాతాదారులు ప్రస్తుత విత్‌డ్రాయల్ పద్ధతిలో ఎలాంటి మార్పులూ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఐతే తమ బ్యాంకు కార్డు ద్వారా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచి సొమ్ము డ్రా చేసే సమయంలో ఈ ఓటీపీ నిబంధన వర్తించదని, కారణం అందుకు సంబంధించిన పనివిధానాన్ని నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్‌ఎఫ్‌ఎస్)లో ఇంకా పొందుపరచలేదని స్పష్టం చేసింది. కాగా ఓటీపీ విధానంలో ఖాతాదారు తాను విత్‌డ్రా చేయగోరు సొమ్ము మొత్తాన్ని ఎంటర్ చేయగానే ఏటీఎం స్క్రీన్‌పై ఓటీపీ డిస్‌ప్లే అవుతుందని ఎస్‌బీఐ ఆ ప్రకటనలో వివరించింది.