బిజినెస్

‘హీరో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండియా’పై ఇర్దాయ్ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బీమా నియంత్రణ సంస్థ ఇర్దాయ్ మంగళవారం ‘హీరో ఇన్సూరెన్స్ బ్రోకింక్ ఇండియా’ కంపెనీపై కొరడా ఝళిపించింది. నిబంధనలకు నీళ్లొదిలిన ఆ కంపెనీకి రూ. 2.18 కోట్ల జరిమానా విధించింది. మోటారు వాహనాల ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఆ సంస్థ పా టించలేదని, పైగా వినియోగదారుల ను ఆ కంపెనీకి చెందిన ప్యానల్‌లోనే బీమా పాలసీలు తీసుకోవాలని వత్తిడి తెచ్చిందని, అంతేకాకుండా పాలసీదార్లను పట్ల వివక్షను చూపిందని ఇర్దా య్ ఈ సందర్భంగా తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ ఆరోపణలకు సంబంధించి తమకు అనేక ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.