బిజినెస్

మాల్యాకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వివిధ బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్ర త్యేక కోర్టులో చుక్కెదురైంది. చెల్లించాల్సిన అప్పులను తీర్చుకోవడానికి ఆయనకు సం బంధించిన చరాస్థులను ఉపయోగించుకోవచ్చని ప్రత్యేక న్యాయస్థానం ఎస్‌బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు అనుమతినిచ్చింది. 2016లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పీ ఎంఎల్‌ఏ) ప్ర త్యేక న్యాయస్థానం మాల్యాకు చెందిన ఆస్తులను బ్యాంకులకు అటాచ్ చేసింది. మాల్యకు బ్రివెర్రీస్ హోల్డింగ్స్ లి మిటెడ్ (యుబీహెచ్‌ఎల్)లో షేర్లు ఉన్నా యి. బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన అప్పుల ను చెల్లించని ఎగవేతదారునిగా కూడా పీఎంఎల్‌ఏ కోర్టు ప్రకటించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం అప్పులు చెల్లించని వారిని అపరాధిగా ప్రకటిస్తుంది. ఆర్థిక నేరస్తునిగా ప్రకటించడమే కాకుండా వారెంట్ జారీ అయినందున మాల్యా చెల్లించాల్సిన అప్పులను తిరిగి రాబట్టుకునేందుకు ఆయనకు సంబంధించిన చరాస్తులను వినియోగించుకోవడానికి ప్రత్యేక కోర్టు మంగళవా రం అనుమతించింది. పీఎంఎల్‌ఏ కోర్టు లోగడ మాల్యాకు చెందిన ఆస్తులను అటా చ్ చేయగా, ఇప్పుడు ఆ అటాచ్‌మెంట్ ఆం క్షలను కోర్టు ఎత్తివేసిందని కన్సార్టియమ్ తరఫున వాదన వినిపిస్తున్న సీనియర్ న్యా యవాది రాజీవ్ పాటిల్ తెలిపారు. అయితే ఈ అటాచ్‌మెంట్ సంగతి తమకు తెలియదని, మాల్యా తరఫు సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ తెలిపారు.
'చిత్రం... మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా