బిజినెస్

ఏడు చమురు, సహజ వాయువుల బ్లాక్స్ దక్కించుకున్న ఓఎన్‌జీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల సంస్థ ఓఎన్‌జీసీ గురువారం జరిగిన టెండర్లలో ఏడు చమురు, సహజ వాయువుల బ్లాక్స్‌ను హస్తగతం చేసుకుంది. తాజా రౌండ్-4 వేలంలో కేవలం ఎనిమిది బిడ్లు మాత్రమే దాఖలవడం విశేషం. ఈమేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోబాటు ఆ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో ఓఎన్‌జీసీ ఈ కాంట్రాక్టు లైసెన్స్ ఒప్పందాలపై గురువారం సంతకాలు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బేసిన్లకు చెందిన ఈ ఏడు బ్లాకుల్లో 18,510 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు, సహజవాయు అనే్వషణ, ఉత్పత్తిని ఈ మేరకు ఓఎన్‌జీసీ చేపడుతుంది. ఈ ఏడు బ్లాకుల్లో సుమారు 33 బిలియన్ బ్యారెళ్ల చమురు లేదా దానికి సమానమైన సహజవాయు నిల్వలున్నాయని అంచనా. ఈ తాజా లైసెన్సింగ్ రౌండ్ బిడ్‌కు వివిధ కంపెనీలను ఆహ్వానించినప్పటికీ కేవలం ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ మాత్రమే పాల్గొన్నాయి. ఓఎన్‌జీసీ ఏడు బ్లాకులకు బిడ్లు దాఖలు చేయగా, ఆయిల్ ఇండియా ఒక ఆఫర్‌కు బిడ్ వేసింది. కాగా మధ్యప్రదేశ్‌లోని మొత్తం ఐదు బ్లాకులను ఓఎన్‌జీసీ దక్కించుకుంది. అలాగే పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌లోని ఒక్కో బ్లాకును కైవసం చేసుకుంది. కాగా ఓపెన్ అక్రియేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద ఏడు బ్లాకులను నాలుగోరౌండ్‌లో ఆఫర్ చేసినట్టు ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్మన్స్ (డీజీహెచ్) అధికారులు వివరించారు. ఇందులో 16 బేసిన్లలోని 94 బ్లాకులను రెండున్నరేళ్ల స్వల్పకాలిక ఎక్స్‌ప్లొరేషన్ పాలసీ కింద 1,36,800 చదరపు కిలోమీటర్ల మేర అందజేశామని ఈ సందర్భంగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. అలాగే 94 బ్లాకుల్లో 29.270 కిలోమీటర్లలో 2డీ సీయెస్మిక్ సర్వే నిర్వహణకు, 43,272 చదరపు కిలోమీటర్లలో 3డీ సీయెస్మిక్ సర్వే నిర్వహణకు పెట్టుబడిదారులు అంగీకారాన్ని తెలిపారని మంత్రి చెప్పారు. 369 చమురు, సహజవాయువుల అనే్వషణ బావులు, వనరులకు సంబంధించిన 290 కోట్ల వివరణలు సమర్పించేందుకు కూడా అంగీకారం కుదిరిందన్నారు. ఇందుకుగాను రూ. 16,450 కోట్ల పెట్టుబడులు వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో సమకూరే అవకాశాలున్నాయని వివరించారు.