బిజినెస్

ఆటోమెటిక్ టోల్ ప్లాజా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 2: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో న్యూ కార్ పార్కింగ్, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన మెయిన్ మేనేజ్‌మెంట్ ఆటోమెటిక్ టోల్ ప్లాజాను గురువారం విమానాశ్రయ డైరెక్టర్ ఎం మధుసూదనరావు ప్రారంభించారు. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విమాన ప్రయాణికులను దించి, ఎక్కించుకునే కారు పార్కింగ్ ఫీజును 30 నుండి 20 రూపాయలకు తగ్గించినట్లు ఆయన చెప్పారు. 30 నిమిషాల కాల వ్యవధిలో ప్రయాణికులను దించి వెళ్ళి పోవాలన్నారు. అదనంగా వేచి ఉండే అనుమతి లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే వాహనాలకు రూ. 500 రూపాయల జరిమానా వసూలు చేస్తామన్నారు. విమానాల రాక ఆలస్యమైతే అదనంగా టోల్‌చార్జీ చెల్లించాలన్నారు. కార్లు, మినీ బస్సులు 10 గంటలు ఉండాలంటే 160 రూపాయలు చెల్లించాలన్నారు. మ్యాక్సి క్యాబ్, ట్యాక్సీ, ఓలా, ఊబర్ లాంటి వారికి ప్రత్యేకంగా అప్లికేషన్ బేస్డ్ ఏర్పాటు చేశామన్నారు. ఓలా, ఊబర్, క్యాబ్‌లకు ఏడాది పాటు వచ్చే విధంగా టెండర్లు వేశామన్నారు. ఓలా, ఊబర్లు ఒక్కరికి మాత్రమే లైసెన్సు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు ఎసీపీ కె వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.