బిజినెస్

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: నూతన సంవత్సరం తొలిరోజు మోస్తరు లాభాలతో శుభారంభాన్నిచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజైన గురువారం భారీ లాభాలను ఆర్జించి వాణిజ్య వర్గాల్లో జోష్ నింపాయి. సెనె్సక్స్ ర్యాలీ తీసి 320 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ సరికొత్త జీవితకాల ముగింపుగరిష్ట స్థాయికి చేరింది. ప్రధానంగా వౌలిక, బ్యాంకింగ్, ఇంధన స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దేశ, అంతర్జాతీయ సానుకూలతలు ఇందుకు దోహదం చేశాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) గణాంకాల మేరకు దేశీయంగా తయారీ రంగం గడచిన 2019 డిసెంబర్‌లో గణనీయమైన వృద్ధిరేటును కనబరచిందని వెల్లడైంది. ప్రత్యేకించి గడచిన జూలై మాసం నుంచి పెరిగిన కొత్త ఆర్డర్లతో తయారీ రంగానికి ఊపువచ్చిందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. అలాగే జీఎస్టీ వసూళ్లు సైతం డిసెంబర్‌లో లక్ష కోట్ల మార్కును దాటాయి. ఇది దేశంలో వినిమయ శక్తి పెరిగిందనడానికి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే అదిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనా సెంట్రల్ బ్యాంక్ ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యాన్ని క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపట్టడం ప్రధానంగా ఆసియా మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. అలాగే అమెరికా-చైనా వాణిజ్య చర్చలకు సంబంధించిన మధ్యంతర ఒప్పందానికి తేదీ ఖరారు కావడం సైతం కలిసివచ్చింది. ఇక దేశీయంగా ఈ దఫా కేంద్ర బడ్జెట్‌లో వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రయోజనం చేకూరేలా వివిధ ప్రధాన రంగాలకు వ్యయ అంచనాలు ద్విగుణీకృతం కానున్నాయన్న కథనాలు సైతం మదుపర్ల విశ్వాసాన్ని పెంచిందంటున్నారు. అలాగే పారిశ్రామిక రంగం కూడా ఏడు నెలల గరిష్ట స్థాయి వృద్ధిరేటును నమోదు చేసింది. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 320.62 పాయింట్లు (0.78 శాతం) ఎగబాకి 41,626.64 పాయింట్ల ఎగువన స్థిరపడగా, బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 99.70 పాయింట్లు (0.82 శాతం) లాభపడి జీవితకాల ముగింపు గరిష్టం 12,282.20 పాయింట్ల ఎగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో అల్ట్రా సిమెంట్ భారీగా 4.37 శాతం లాభపడింది. అదే బాటలో టాటాస్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐటీసీ లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు బజాజ్ ఆటో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, నెస్టల్ ఇండియా, కోటక్ బ్యాంక్, హీరోమోటోకార్ప్ 0.89 శాతం మేర నష్టాలను చవిచూశాయి. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో వౌలిక పరికరాలు, లోహ, కేపిటల్ గూడ్స్, పారిశ్రామిక, ఇంధన, స్థిరాస్తి, ఫైనాన్స్ సూచీలు గణనీయంగా 2.94 శాతం లాభపడ్డాయి. ఐటీ, టెక్ రంగాలు మాత్రం నష్టాలను చవిచూశాయి. బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.44 శాతం లాభపడ్డాయి.
క్షీణించిన రూపాయి విలువ
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం 11 పైసలు క్షీణించింది. ఇంట్రాడేలో 71.33గా ట్రేడైంది. ఇక చైనా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యవినిమయ విధానాన్ని సరళతరం చేసింది. అలాగే అమెరికాతో వాణిజ్య చర్చల సానుకూలత తోడవడంతో ప్రపంచ మార్కెట్లకు లాభాల పంట పండింది. ప్రత్యేకించి ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్ మార్కెట్లు 1.25 శాతం లాభపడ్డాయి. సియోల్ మాత్రం నష్టాల్లో ముగిసింది. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో భారీ లాభాలను నమోదు చేశాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు 0.42 శాతం పెరిగి బ్యారెల్ 66.28 డాలర్ల వంతున ట్రేడైంది.