బిజినెస్

కడప స్టీల్ ప్లాంట్ దిశగా వడివడిగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 7: కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి మంజూరు చేయించుకోవాల్సి వుంది. పర్యావరణ అనుమతులు (ఈసీ), సాయిల్ ఇనె్వస్టిగేషన్ సర్వే తదితర అనుమతులు రావాల్సి ఉంది. డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు , పర్యావరణ క్లియరెన్స్, సాయిల్ ఇనె్వస్టిగేషన్ సర్వేలు ప్రభుత్వాధికారుల ద్వారా కేంద్రానికి పంపడం ఆలస్యం కావడం, కేంద్రం నుండి మరిన్ని సందేహాలు రావడం వంటి వాటిని అధిగమించేందుకు ఈ ఫైళ్ల తయారీని నిపుణులైన ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించబోతున్నారు. డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి టెండర్లు కూడా పిలిచారు. ఈనెల 15లోపు టెండరు ఖరారు చేసి ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనున్నారు. అదే విధంగా పర్యావరణ క్లియరెన్స్ కోసం ఫైళ్ల తయారీని మరో ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. సాయిల్ ఇనె్వస్టిగేషన్ సర్వేను మరో ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పబోతున్నారు. ఈ అనుమతులన్నీ నాలుగైదు నెలల్లో లేదా గరిష్టంగా ఏడెనిమిది నెలల్లో వస్తాయని ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీహెచ్‌సీఎల్) అధికారులు భావిస్తున్నారు.
ఏపీహెచ్‌ఎస్‌సీఎల్ అధికారులు మరోవైపు నాలుగు ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు దక్షిణ కొరియా, జపాన్, భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆయా కంపెనీలు కొన్ని రాయితీలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. దీనిపై మరోదఫా చర్చలు జరిపి, ఏదో ఒక కంపెనీకి స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన 3,148 ఎకరాలను అప్పగిస్తారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వమే ఏపీహెచ్‌ఎస్‌సీఎల్ తరపున ప్రహరీ నిర్మాణం, ఏపీహెచ్‌ఎస్‌సీఎల్ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ప్రహరీ, కార్యాలయ నిర్మాణం కోసం జిల్లాకు చెందిన అధికారులు అంచనాల తయారీలో నిమగ్నమయ్యారు. ప్రతిపాదనలు తయారైన వెంటనే ప్రహరీ, కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నారు. ఒకటి రెండు నెలల్లో స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ప్రహరీ నిర్మాణం ప్రారంభం కానుంది. నాలుగైదు నెలల్లో ఇక్కడ పరిశ్రమ స్థాపించబోయే కంపెనీ ఖరారు అన్నీ నిర్ధారణ అవుతాయని ఏపీహెచ్‌ఎస్‌సీఎల్ అధికారులు చెబుతున్నారు. చర్చలు జరుపుతున్న కంపెనీల్లో ఏదైనా పూర్తిగా తామే పరిశ్రమ స్థాపనకు పూనుకున్నా, ఏపీహెచ్‌ఎస్‌సీఎల్ భాగస్వామ్యంతో పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చినా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అంచనా వేశారు. 30 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఉక్కు పరిశ్రమ సాకారమైతే జిల్లాలోని స్థానికులకు దాదాపు 75 శాతం ఉద్యోగాలు లభించనున్నాయి. పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
*ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ (పాతచిత్రం)