బిజినెస్

‘ఈశాన్య’ గ్యాస్ గ్రిడ్‌కు రూ.5,559 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: నార్త్‌ఈస్ట్ గ్యాస్ గ్రిడ్‌కు 5,559 కోట్ల రూపాయల ఫండింగ్‌ను కేంద్రం మంజూరు చేసింది. బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక గ్రిడ్‌కు లేదా గ్యాస్ పైపులైన్‌కు సహజంగా ఆర్థిక సాయా న్ని అందించదు. అయితే, కేవలం నార్త్‌ఈస్ట్ గ్రిడ్‌కు మాత్రమే ప్రత్యక్షంగా ఫండింగ్ ఇస్తోంది. అదే క్ర మంలో సీసీఈఏ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రకటించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌తో కలసి ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్త్‌ఈస్ట్ గ్రిడ్ కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటానగర్, డిమాపూర్, కోహిమా, ఇంఫాల్, ఐజ్వాల్, అగర్తలా, షిల్లాంగ్, సిల్‌చార్, గ్యాంగ్‌టక్, లుమాలిగఢ్ ప్రాంతాల మీదుగా గౌహతిలోని పైపులైన్‌కు అనుసంధానమ య్యే 1,656 కిలోమీటర్ల పొడవైన నార్త్‌ఈస్ట్ గ్యాస్‌గ్రిడ్ వల్ల ఎంతో లాభం చేకూరుతుందని చెప్పారు. గృహావసరాలకు వంటగ్యాస్‌తోపాటు వాహనాలకు సీఎన్‌జీ సరఫరా కూడా దీని ద్వారా జరుగుతుందని మంత్రి ప్రదాన్ వివరించారు. ఇంధన పరిశ్రమలకు కూడా ఈ పైపులైన్ ఉపయోగపడుతుందని అన్నారు. నిజానికి 9,265 కోట్ల రూపాయల వ్యయంతో ఇంతటి పొడవాటి పైపులైన్ నిర్మించడం వల్ల కేంద్రానికి వచ్చే ఆర్థిక లాభం ఏమీ ఉండదు. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలోని గెయిల్ ఇండి యా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్), లు మాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఎల్) సంయుక్తంగా ఈ పైపులైన్ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తాయి. కేంద్రం నేరుగా 60 శాతం ఖర్చు ను భరిస్తుంది. మిగతా మొత్తాన్ని ఆయా కార్పొరేషన్లు చెల్లిస్తాయి. అయితే, వాణిజ్యపరంగా చూసుకుంటే ఇంత భారీ మొత్తంతో పైపులైన్ నిర్మాణం వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. కానీ ప్రజలు, పరిశ్రమల అవసరాల కోసం ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టక తప్పదని మంత్రి ప్రదాన్ వ్యాఖ్యానించారు.