బిజినెస్

పలు కార్పొరేషన్ల వాటాల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్, నేషనల్ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మెకాన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వాటాలను కొంత మేర విక్రయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీసీలో 49.78 శాతం, ఎన్‌ఎండిసిలో 10.10 శాతం, మెకాన్‌లో 0.68 శాతం, బీహెచ్‌ఈఎల్‌లో 0.68, ఒరిస్సాకు చెందిన రెండు పబ్లిక్ రంగ సంస్థ లు ఐపిఐసిఓఎల్‌లో 12 శాతం, ఓఎంసిలో 20.47 శాతం వాటాలను విక్రయించేందుకు మంత్రివర్గం సూత్రప్రాయంగా అనుమతి మంజూరు చేసింది. రెండు ఆంచెల విక్రయ విధానం ద్వారా వ్యూహాత్మక కొనుగోలుదారున్ని ఎంపిక చేస్తారు. ఈ సంస్థల వాటాల వియ్రం ద్వారా సేకరించే నిధులను సామాజిక రంగం అభివృద్ది కార్యక్రమాల అమలుకు ఖర్చు చేస్తారు. వ్యూహాత్మక కొనుగోలుదారుడు అదనపు పెట్టుబడులు తీసుకునిరావడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తారనీ, దీని వలన ఈ రంగం ఎంతో అభివృద్ది సాధించేందకు అవకాశం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
బొగ్గు గనుల వేలం
బొగ్గు గనులను వేలం వేసేందుకు వీలు కల్పించే విధంగా నియమాలను సవరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉక్కు, ఇంధన రంగాలు బొగ్గు గనులను తీసుకునేందుకు వీలు కల్పించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. బొగ్గు గనులపై ఇంత కాలం కొనసాగిన చివరి ఉపయోగ కర్త నియమాలను కూడా సడలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని ప్రహ్లాద్ జోషి విలేకరులతో చెప్పారు. ఖనిజాల సవరణ చట్టం ఆర్డినెన్స్‌ను జారీ చేసేందుకు మంత్రివర్గం అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ ఆర్డినెన్స్ జారీ అయిన అనంతరం బొగ్గు గనుల వేలాన్ని అన్ని రంగాల వారికి వర్తించేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. నలభై ఆరు ఇనుప రజను, ఇతర గనులను 2020 మార్చ్ 31 లోగా వేలం వేసేందుకు ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.