బిజినెస్

కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర భాగస్వాములు కూడా ఏకాగ్రతతో కృషి చేయవలసిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించాలనేది అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన కాదు.మన దేశం ఆర్థిక బలాన్ని లోతుగా అర్థం చేసుకోవటం వలన ఈ ఆలోచన పుట్టింది’అని ప్రధాన మంత్రి వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన 2020-21 ఆర్థిక ప్రణాలికను పార్లమెంటులో ప్రతిపాదించనున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ గురువారం ప్రణాళికా పెట్టుబడుల గురించి సీనియర్ ఆర్థిఖ శాస్తవ్రేత్తలు,ప్రైవేట్ ఈక్విటీ,వెంచర్ క్యాపిటలిస్టులు, వ్యాపార నాయకులు, ఉత్పత్తిదారులు, పర్యటన, ప్రయాణ సంస్థల సీనియర్ అధికారులు, రెడీమేడ్ బట్టల తయారీ దారులు, సీనియర్ విశే్లషకులు, వ్యవసాయం, సైన్సు, టెక్నాలజీ, ఆర్థిక రంగాలకు చెందిన నిపుణులతో నీతి ఆయోగ్ కార్యాలయంలో చర్చలు జరిపారు. ‘ఈ రెండు గంటల చర్చల్లో నాకు ఎంతో తెలిసింది.ఆయా రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలు, అనుభవాలను తెలుసుకోగలిగా’నని మోదీ వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థతి ఏమిటనేది తనకు అవగతమైందన్నారు. ఇలాంటి సమావేశాల ద్వారా విధాన నిర్ణయాలు తీసుకునేవారికి, సంబంధిత భాగస్వాముల మధ్య మరింత అవగాహన, సాన్నిహిత్యం పెరుగుతుందని, అలాగే ప్రణాళికల రూపకల్పన, అమలు సులభతరం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేన్నయినా సాధించగలుగుతామనే విశ్వాసం, ఉత్సాహం ఇలాంటి సమావేశాల ద్వారా కలుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకున్న గట్టి వినియోగ సామర్థ్యం దాని ప్రాథమిక బలాన్ని స్పష్టం చేస్తోందని, తిరిగి పుంజుకోగల మన్న నమ్మకాన్నీ కలిగిస్తోందన్నారు. పర్యాటక, పట్టణాభివృద్ధి, వౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించటంతోపాటు ఉపాధిని సృష్టించే శక్తి, సామర్థ్యాలు కూడా అవి కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌లో అపరిమిత అవకాశాలున్నాయని, వాస్తవాలకు అభిప్రాయాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తుడిచివేసేందుకు భాగస్వాములందరూ కృషి చేయవలసిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి సూచించారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని, ఒక దేశంగా ఆలోచించటం ప్రారంభించాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మొత్తం 38 మంది హాజరయ్యారు. వీరిలో ఆర్థిక శాస్తవ్రేత్తలు శంకర్ ఆచార్య, ఆర్.నాగరాజు, ఫర్జానా అఫ్రీదీ, వెంచర్ పెట్టుబడిదారుడు ప్రదీప్ షా, పారిశ్రామికవేత్తలు మల్లవరపు అప్పారావు, దీప్ కల్రా, పతంజలి గోవింద్ కేశ్వానీ, దీపక్ సేథ్, శ్రీకుమార్ మిశ్రా, విషయనిపుణులు అశీష్ ధావన్, శివసరిన్ తదితరులు ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రోడ్లు,్భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్ర తోమర్, వివిధ శాఖల కార్యదర్శులు, నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
'చిత్రం... ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవనంలో గురువారం ఆర్థిక వేత్తలు, నిపుణులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ