బిజినెస్

లండన్ నుంచి బెంగళూరుకు లగ్జరీ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 9: లండన్ నుంచి బెంగళూరుకు లగ్జరీ విమాన సర్వీసును ప్రారంభించినట్టు బ్రిటిష్ ఎయిర్‌వేస్ గురువారం ప్రకటించింది. అత్యాధునిక హంగులతో కూడిన ఈ సర్వీసులో ‘క్లబ్ సూట్’ అని పిలిచే లగ్జరీ ప్రైవేట్ సూట్ ఉంటుంది. ఇందులో ప్రయాణిస్తే, ఇతర ప్రయాణికులతో సంబంధం లేకుండా, ఒక హోటల్ రూమ్‌లో కూర్చున్న అనుభవం కలుగుతుంది. ప్రత్యేక క్యాబిన్, వెనక్కు వాలడానికి వీలుగా సీట్లు, దిండ్లు కూడా ఉన్నాయి. మరోలా చెప్పాలంటే దీనిని మినీ వానిటీ వ్యాన్‌గా పేర్కోవచ్చు. ఇప్పటి వరకూ లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఇలాంటి సర్వీసులను దుబాయ్, టోరంటో, టెల్ అవీవ్‌కు నడుపుతున్నది. నాలుగో సర్వీసు కింద బెంగళూరు ఈ జాబితాలో చేరింది. భారత దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన బెంగళూరుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అందుకే, లగ్జరీ సర్వీసుకు ఆ నగరానే్న ఎంపిక చేసుకున్నామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.