బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి ప్రైవేట్ రైళ్ల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: భారతీయ రైల్వే తొలుత ప్రయాణికుల రైళ్లను దశలవారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్రం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సస్తోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రైవేట్ రైళ్లు పరుగుతీయనున్నాయి. ముందుగా సికింద్రాబాద్-విశాఖపట్నం, తిరుపతి- విశాఖపట్నం, తిరుపతి-సికింద్రాబాద్, లింగంపల్లి-కాకినాడ (వయా గుడివాడ) మధ్య ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తొలుత రెండు రాష్ట్రాల మధ్య 8 ప్రైవేట్ రైళ్లు నడపాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ప్రైవేట్ రైళ్లల్లో ఎలాంటి రాయితీలు వర్తించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణం చివరి నిమిషం వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే విమానం తరహాలో టికెట్ల బుకింగ్ ఉంటుంది. చివిరి నిమిషం తీసుకున్న టికెట్ల ధరలు టికెట్‌పై సర్‌చార్జీలు ఎక్కువగా వసూళ్లు చేస్తారు. ప్రైవేట్ రైళ్లన్నింటినీ రద్దీ ఉన్న మార్గాల్లో నడుపుతారు. ప్రైవేట్ రైళ్లు నిర్వహణపై ఆందోళన చేపట్టాలని రైల్వే కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణాన్ని కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. వౌలిక సదుపాలు లేని మార్గాల్లో ప్రైవేట్ రైళ్లను ప్రోత్సహించాలని రైల్వే కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలకు అనుసంధానంగా కొత్త మార్గాలను ఏర్పాటు చేసుకుని ఆయా మార్గాల్లో ఆయా ప్రైవేట్ సంస్థలు రైళ్లను నడుపుకోవడాన్ని పరిశీలించాలని రైల్వే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.