బిజినెస్

మూడు దేశాల నూలు దిగుమతులపై ‘యాంటీ డంపింగ్ డ్యూటీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న నూలుపై ‘యాంటీ డంపింగ్ సుంకాల’ను విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధానంగా చైనా, ఇండోనేషియా, వియత్నాంల నుంచి దిగుమతి అవుతున్న నూలుపై ఈ సుంకం విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాశిరకం నూలు దిగుమతుల నుంచి దేశీయ వ్యాపారులను పరిరక్షించాన్న ఉద్దేశ్యంతోనే ఈ సుంకాన్ని విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. దేశీయ తయారీదార్ల సంఘం ఫిర్యాదు మేరకు కేంద్ర వాణిజ్య పరిశోధనా మంత్రిత్వ శాఖ పరిధిలోని వాణిజ్య సమస్యల డైరెక్టరేట్ జనరల్ (డీజీటీఆర్) జరిపిన దర్యాప్తులో ‘విస్కోస్ స్పన్ యార్న్’ను సంబంధిత విదేశీ కంపెనీలు నాశిరకంగా తయారు చేసి మనదేశానికి ఎగుమతి చేస్తున్నట్టు తేలిందని ఆ అధికారులు తెలిపారు. ప్రధానంగా పై మూడు దేశాల నుంచి వస్తున్న ఈ నూలు దిగుమతుల నిల్వలు దేశీయ పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను పాడయ్యేలా చేస్తున్నాయని డీజీటీఆర్ పరిశోధనలో తేలింది. ఈక్రమంలో ఆ నిల్వల వల్ల కలిగే నష్ట తీవ్రతను సైతం అంచనా వేసినట్టు ఆ పరిశోధనా విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా దేశీయ పరిశ్రమలకు నష్టం కలిగిస్తున్నది వాస్తమని తేలితే డీజీటీఆర్ సరికొత్త యాంటీ డంపింగ్ డ్యూటీ విధించేందుకు సిఫారసు చేస్తుందని, దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం చేస్తుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, గతంలో 2016 నుంచి 19 వరకు జరిగిన దిగుమతుల డేటాను, నాణ్యతను పరిశీలిస్తున్నట్టు డీజీటీఆర్ తెలిపింది.