బిజినెస్

రేపటి నుంచి దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: దావోస్‌లో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనే భారత బృం దానికి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వం వహిస్తారు. అదే సమయంలో, అక్కడే జరిగే ప్రపంచ వాణిజ్య సమాఖ్య (డబ్ల్యూటీఓ) కార్యవర్గ భేటీలోనూ ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, రష్యా, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ వాణిజ్య మంత్రులతో వేరువేరుగా ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని పేర్కొంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్‌తోనూ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రధాన కార్యదర్శితోనూ ఆయన చర్చలు జరుపుతారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యే వివిధ కంపెనీల సీఈఓలతోనూ వేరువేరుగా ముఖాముఖి భేటీ అవుతారు. భారత దేశ రైల్వే శాఖలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా గోయల్ వారిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. దేశంలో సంస్థాగత పెట్టుబడులకు విదేశీ కంపెనీలను, వాణిజ్య దిగ్గజాలను, వివిధ దేశాల ప్రభుత్వాలను ఆయన కోరనున్నారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో గోయల్‌తోపాటు కేంద్ర షిప్పింగ్, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మండవీయ, కర్నాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, పంజాబ్ ఆర్థిక మంత్రి, తెలంగాణ ఐటీ మంత్రి కూడా పాల్గొంటారు.
'చిత్రం... కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్