బిజినెస్

44 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 44 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాదికాలం గడిచిన సందర్భంగా శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 7,830 కోట్ల రూపాయలని, ఎనిమిది లక్షల మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సీజన్‌లో రైతుల పొలాల్లో ఉన్న ధాన్యంలో మరో రెండు లక్షల టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నామన్నారు. వరిధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరుగుతోందని, రైతులు ఇబ్బందికి గురికాకుండా ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో 40.41 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఈ ఖరీఫ్‌లో మరో ఆరులక్షల టన్నులు అధికంగా సేకరించగలుతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటం, వ్యవసాయ బావులకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వడం, పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా 10 వేల రూపాయలు ఇవ్వడం తదితర కారణాల వల్ల ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, పెద్దపల్లి, మెదక్ తదితర జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి అధికంగా అవుతోందన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం, మద్దతు ధర చెల్లించడానికి ఆధునిక విజ్ఞానాన్ని వాడుతున్నామని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు, సాంకేతికపరిజ్ఞాన వినియోగం పరిశీలించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అధికారిక బృందాలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఒకవైపు రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తూ, మరోవైపు అర్హులైన వారికి రేషన్ బియ్యం కిలో రూపాయికే సరఫరా చేస్తున్నామని చైర్మన్ పేర్కొన్నారు. పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఉద్యోగులు నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఇదే విధంగా ఇక ముందుకూడా పనిచేసి, సంస్థకు మంచిపేరు తేవాలని కోరారు. రైతులకు సంబంధించిన పౌరసరఫరాల కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ కార్పొరేన్‌గా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులంతా సహకరించాలని మారెడ్డి కోరారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి. సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... మారెడ్డి శ్రీనివాస్‌ర్డెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి