బిజినెస్

గడిచిన ఏడాది 41% తగ్గిన ఈక్విటీ మూచ్యువల్ ఫండ్స్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: గడచిన 2019లో ఇనె్వస్టర్లు దేశీయ ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ. 75,000 కోట్లు మదుపు చేశారు. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 41 శాతం తక్కువ కావడం గమనార్హం. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్థి మందగమనం క్రమంలో మార్కెట్లు ఊగిసలాటకు గురికాడమే ఇందుకు కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మార్కెట్లు పుంజుకోవడంతోబాటు ఈక్విటీ పథకాలు మదుమర్లను ఆకర్షించే అవకాశాలున్నాయంటున్నారు. మరికొంత కాలం మాత్రం స్టాక్ మార్కెట్ల ఊగిసలాట కొనసాగవచ్చని, ఈ ఊగిసలాటను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, సంపదను పెంచుకునేందుకు మదుపర్లు ప్రయత్నిస్తారని, ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమకు పెట్టుబడుల శాతం గణనీయంగా పెరిగుతుందని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ విభాగం సీఈవో, ఎండీ అశ్వనీ భాటియా అభిప్రాయపడ్డారు. ఈక్విటీ ఫండ్లతోబాటు అన్ని రకాల మ్యూచువల్ పండ్స్ ఈ ఏడాది స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) వద్ద లభించిన వివరాల మేరకు ఈక్విటీలు, వాటి ఆధారిత పొదుపుపథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్) రూ. 74,870 కోట్ల పెట్టుబడులు 2019లో రాబట్టాయి. ఐనప్పటికీ 2018లో వచ్చిన రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులకంటే ఇది చాలా తక్కువ. 2017 నుంచి ఇలాంటి పథకాలన్నీ గణనీయమైన వృద్ధిని కనబరచాయి. ఆ ఏడాది రూ. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే 2016లో వచ్చిన రూ. 51 వేల కోట్ల పెట్టుబడులకంటే 2017లో రెండురెట్ల కంటే అధిక పెట్టుబడులు రావడం విశేషం. ఈక్రమంలో గడచిన రెండేళ్లతో పోలిస్తే గత ఏడాది ఈ పెట్టుబడుల్లో మందగమనం చోటుచేసుకుందని, ఇందుకు మార్కెట్ల ఊగిసలాటే కారణమని ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్స్ విభాగం చీఫ్ కైలాష్ కుల్‌కర్ణి తెలిపారు. ప్రధానంగా ఏడాది చివరలో ఈ పెట్టుబడుల రాకలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుందని, ప్రత్యేకించి గత నవంబర్‌లో ఈ పెట్టుబడుల శాతం 41 నెలల కనిష్టానికి పడిపోయి రూ. 1,312 కోట్లు మాత్రమే సమకూరాయని, ఇందువల్ల మదుపర్లు తమ నిధులకు సంబంధించిన సూచీల్లో లాభాలను చూడలేకపోయారని వివరించారు. ఆ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలోని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం మదుపర్ల విశ్వాసాన్ని చూరగొని లాభపడ్డాయని ప్రీమియర్ ఇనె్వస్టర్. ఇన్. సహ వ్యవస్థాపకుడు విద్యాబాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈక్విటీ పెట్టుబడులు ప్రధానంగా రెండు విధాలుగా వస్తాయి. అందులో ఒకటి సిస్టమాటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), మరొకటి నాన్ సిప్. కాగా సిప్ విధానంలో గడచిన కొని సంవత్సరాలుగా పెట్టుబడులు స్థిరమైన వృద్థిని కనబరుస్తున్నాయి.
ఈక్రమంలో ఈ పెట్టుడులు నెలవారీగా రూ. 8,000 కోట్లకు చేరాయి. ఐతే నాన్ సిప్ విధానం పెట్టుబడుల్లో మాత్రం ఊగిసలాట కనిపిస్తోంది. మొత్తం ఫండ్ హౌస్‌లు సిప్ ద్వారా ఆర్జించిన మొత్తం రూ. 82,453 కోట్లకు చేరింది. ప్రధానంగా ఇందులో రీటెయిల్ మదుపర్ల భాగస్వామ్యం అధికంగా ఉంది. మార్కెట్ రిస్క్‌ను తగ్గించుకునేందుకే ఇలా రీటెయిల్ మదుపర్లు సిప్ మార్గాన్ని ఎంచుకున్నారని విశే్లషకులు చెబుతున్నారు. ఈ పరిశ్రమకు సిప్ ద్వారా ప్రతినెలా 9.55 లక్షల ఖాతాలు చేకూరగా ఇందులో ఒక్కో ఖాతాకు సరాసరి సిప్ సైజు దాదాపు రూ. 2,850 కోట్లు. 2020లో సిప్ మరింత స్థిరమైన, బలమైన వృద్ధిని కనపబరుస్తుందని మరో ప్రముఖ విశే్లషకుడు కౌస్త్భు బేలాపుర్కార్ ధీమా వ్యక్తం చేశారు.