బిజినెస్

డిసెంబర్‌లో 9శాతం తగ్గిన ప్యాసింజర్ వాహన విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: గడచిన 2019 డిసెంబర్ మాసంలో ప్యాసింజర్ వాహనాల రీటెయిల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. ఆ నెలలో మొత్తం 2,15,716 యూనిట్ల విక్రయాలు జరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) మంగళవారం నాడిక్కడ వెల్లడించింది. 2018 డిసెంబర్‌లో 2,36,586 యూనిట్ల విక్రయాలు జరిగాయని, దానితో పోలిస్తే ఈ దఫా గణనీయ తగ్గుదల చోటుచేసుకుందని తెలిపింది. ద్విచక్ర వాహనాల విక్రయాల విక్రయాలు సైతం 16 శాతం తగ్గుదలతో 15,00,545 నుంచి 12,64,169 యూనిట్లకు తగ్గిపోయాయని వివరించింది. వాణిజ్య వాహన విక్రయా లు 21 శాతం తగ్గుదలతో 85,833 యూనిట్ల నుంచి 67,793 యూనిట్లకు పడిపోయాయని తెలిపింది. ఐతే మూడు చక్రాల వాహనాల విక్రయాల్లో మా త్రం ఒక శాతం వృద్థి చోటుచేసుకుంది. మొత్తం 58,324 త్రిచక్ర వాహన విక్రయాలు గడచిన డిసెంబర్‌లో జరిగాయి. ఆఫర్లు అందుబాటులో ఉన్నా కొనుగోళ్లు ఆశించినంత లేవని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షు డు ఆశిష్ హర్షరాజ్ కాలే ఆవేదన వ్యక్తం చేశారు.