బిజినెస్

బీమా ప్రీమియం వసూళ్లు వచ్చే మూడేళ్ల వరకు తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 21: ప్రస్తుతం అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ల తీరుతోబాటు, దేశీయం గా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు వచ్చే రెండు మూడేళ్ల వరకు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ‘మూడీస్’ ఈమేరకు తన నివేదికను మంగళవారం నాడిక్కడ విడుదల చేసింది. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బీ మా ప్రీమియం వసూళ్లలో మందగమనం చోటుచేసుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రధానంగా జనరల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లలో ఈ తగ్గుదల అధికంగా కనిపించింది. 2019-20 ఆర్థిక సం వత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు దశాబ్ధ కనిష్టం 5 శాతంకన్నా తగ్గుదల చోటుచేసుకుంటుందన్న అంచనాల క్రమంలో మూడీస్ తాజా నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్) భారత జీడీపీ వృద్ధిరేటును 4.8 శాతానికి పరిమితం చేస్తూ తాజా అంచనాలను వెలువరించడం అన్ని రకాల ప్రతికూలతలకు దారితీసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియం వృద్ధి 11.3 జరిగింది. అంతకుక్రితం ఏడాది 11.5 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ఆర్థిక మాంద్య ప్రభావంతో మొత్తం బీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లు ఈ ఏడాది 17.6 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గుతుందని ఆ నివేదిక తెలిపింది. ఐతే దేశంలో మధ్య తరగతి ప్ర జల శాతం క్రమంగా పెరుగుతుండడం బీమా కం పెనీలకు కలిసివచ్చే అంశమని తెలిపింది. 2018లో ఈ వ్యాపార విస్తరణ (పెనల్ట్రేషన్) శాతం 3.7గా నమోదైందని, అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్ 10.6 శాతం, అమెరికా 7.1 శాతం మార్కెట్లతో పోలిస్తే భారత విస్తరణ శాతం చాలా తక్కువని తెలిపింది. ఐతే దేశీయంగా హెల్త్ ప్రీమియం వసూళ్లలో మా త్రం వృద్ధి కొససాగుతుందని, కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్ లేదా జాతీయ ఆరోగ్య రక్షణ మిషన్ ఇందుకు దోహదం చేస్తాయని మూడీస్ నివేదించింది. ఈ పథకం ద్వారా 100 మిలియన్ కుటుంబాలకు రూ. 5లక్షల వంతున కవరయ్యేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం.