బిజినెస్

వరుసగా రెండో రోజూ నష్టాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజైన మంగళవారం సైతం నష్టాల పాలయ్యాయి. నిరాశాజనక కార్పొరేట్ కంపెనీల మూడోత్రైమాసిక ఫలితాలతోబాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును తగ్గించడం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 205.10 పాయింట్లు (0.49 శాతం) నష్టపోయి 41,323.81 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎస్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ సైతం 54.70 పాయింట్లు (0.45 శాతం) కోల్పోయి 12,169.85 పాయింట్ల దిగువన స్థిరపడింది. నిఫ్టీకి ఇది వరుసగా మూడో నష్టరోజు కావడం గమనార్హం. అలాగే చైనాలో కొత్త రకమైన ‘సార్స్’ తరహా డెడ్లీ వైసర్ వెలుగు చూడడం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేసిందని వాణిజ్య విశే్లషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఆసియా, ఐరోపా మార్కెట్లపై ఈ పరిణామం తీవ్ర ప్రతికూలతకు దారితీసింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టాటాస్టీల్ అత్యధికంగా 3.01 శాతం నష్టపోయింది. అలాగే ఎం అండ్ ఎం, మారుతీ, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ సైతం నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపుఅల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో విద్యుత్, స్థిరాస్తి, లోహ, వాహన, వినిమయ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు 1.47 శాతం లాభపడ్డాయి. టెలికాం, టెక్, ఇంధన సూచీలూ లాభపడగా, బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ సూచీ 0.21 శాతం నష్టపోయింది. అలాగే స్మాల్‌క్యాప్ సూచీ స్తబ్థుగా మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడిలో కొన్ని నిఫ్టీ కంపెనీల ఫలితాలు వెలువరించిన ఫలితాలు అంత ప్రోత్సాహకంగా లేవని ప్రముఖ విశే్లషకుడు హేమాంగ్ కపాసీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక స్థితిని చక్కదిద్దేందుకు వచ్చే బడ్జెట్‌లో కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందన్న అంశంపైనే వాణిజ్య వర్గాల ప్రధాన దృష్టి కేంద్రీకృతమైందన్నారు. కాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సోమవారం భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. 2019లో ఈ వృద్థిరేటు 4.8 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది. ప్రధానంగా నాన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు, గ్రామీణ ఆదాయ వృద్ధి రేటు బలహీనంగా ఉండడాన్ని ఐఎంఎఫ్ ఈ సందర్భంగా తన నివేదికలో ప్రస్తావించింది. ఈక్రమంలో జాగరూకులైన మదుపర్లు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో లాభాల స్వీకరణకు తెరలేపారు.
రూపాయి బలహీనం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం మరింత క్షీణించింది. ఇంట్రాడేలో 71.21గా ట్రేడైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.21 శాతం తగ్గి బ్యారెల్ 64.41 డాలర్ల వంతున ట్రేడైంది. ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ నష్టాలపాలవగా, ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను సంతరించుకున్నాయి.