బిజినెస్

బాండ్ల ద్వారా రూ. 250 కోట్లు సమీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 22: బాండ్ల జారీ ద్వారా రూ. 250 కోట్లు సమీకరించేందుకు నిర్ణయించినట్టు ఎడెల్వెయిస్ ఫైనాన్స్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ (ఈఎఫ్‌ఐఎల్) బుధవారం నాడిక్కడ తెలిపింది. ఇష్యూ బేస్ సైజు రూ. 125 కోట్లని తెలిపింది. తదుపరి రుణాల కేటాయింపునకు, సంస్థకు ఉన్న ప్రస్తుత రుణాల తాలూకు వడ్డీల చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ కార్యకలాపాలకు ఈ నిధులను వినియోగిస్తామని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) తెలిపింది. కాగా తమ కంపెనీ 18, 36, 60, 120 నెలల మెచూరిటీతోకూడిన బాండ్లను నెలవారీ, వార్షిక, సంచిత వడ్డీ చెల్లింపుల ఇచ్చికాలతో విడుదల చేస్తుందని, ఇవి ఏటా 0.25 శాతం లబ్ధి చేకూరుస్తాయని తెలిపింది. ప్రస్తుత బాండ్ హోల్డర్లకు మరో 0.20 శాతం అదనపువడ్డీని చెల్లిస్తామని ఎడెల్వెయిస్ తెలిపింది. ఈ నెల 23 గురువారం విడుదలవుతున్న ఈ ఇస్యూ సబ్‌స్క్రిబ్షన్ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. బీఎస్‌ఈలో ఈ ఇస్యూకు లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ కేపిటల్ మార్కెట్స్ అండ్ ఫైన్షియల్ సర్వీసెస్ (ఈఎఫ్‌ఎస్‌ఎల్), ఎన్‌సీడీ వ్యవహరిస్తాయని వివరించింది.