బిజినెస్

1న స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని, సాధారణ వాణిజ్య కార్యకలాపాలు సాగుతాయని బాంబే స్టాక్ ఎక్చేంజీ (బీఎస్‌ఈ) బుధవారం నాడొక ప్రకటనలో తెలిపింది. స్టాక్ మార్కెట్ల వాణిజ్య వారం సాధారణంగా శుక్రవారంతో ముగుస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినాలు. ఐతే కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఇలాంటి సందర్భాల్లో స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని గుర్తు చేసింది. ఫిబ్రవరి 1న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు స్టాక్ మార్కెట్లలో వాణిజ్య కార్యకలాపాలు సాగుతాయని బీఎస్‌ఈ తెలిపింది. ఇలావుండగా ఈ విషయంలో వాణిజ్య వర్గాలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లకు ప్రోత్సాహకరంగా ఈ బడ్జెట్‌లో అనేక నిర్ణయాలను కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. గతంలో 2015లో ఫిబ్రవరి 25 శనివారం అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఉన్న బడ్జెట్ సమావేశాల సమయాన్ని మార్చినప్పటి నుంచి కేంద్ర బడ్జెట్ రోజుల్లో స్టాక్ మార్కెట్లు పనిచేయడం పరిపాటేనని ఆ ప్రకటన స్పష్టం చేసింది.