బిజినెస్

‘ భారత్ ఆర్థికంగా పుంజుకుంటోంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: భారత దేశ ఆర్థిక స్థితి ఇక పుంజుకుంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ధీమా వ్య క్తం చేశారు. తమ దేశంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, విదేశీ మదుపర్లలో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ఆరి థక ఫోరం (డబ్ల్యుఈఎఫ్) వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘వ్యూహాత్మక దృక్పథం’ అనే అంశంపై జరిగిన సెషన్‌లో ఆయన గురువారం నాడిక్కడ పాల్గొని ప్రసంగించారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల కోసం బ్రిటన్, ఐరోపా సంఘ దేశాలతో తమ ప్రభుత్వం చర్చలు జరుపనుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈనెలాఖరులోగా బ్రిటన్ ఐరోపా యూనియన్ నుంచి వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో పరిస్థితులు తమ దేశానికి అనుగుణంగా మారుతున్నాయని గోయెల్ పేర్కొన్నారు. అనేక విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నాయని, సుమారు ఐదు ప్రముఖ కంపెనీలు రానున్న కొనే్నళ్లలో తమ పూర్తి సిబ్బందిలో 50 శాతాన్ని భారత్ వెలుపల పనిచేయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. ఇక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)ని ఆయన ప్ర స్తావిస్తూ అసమగ్ర వాణిజ్య ఒప్పందాల కారణంగా సంబంధిత వాణి జ్య మార్గదర్శకాలను అమలు చేయడంలో వైఫల్యం చోటుచేసుకుంటోందన్నారు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం ఆర్‌సీఈపీ మార్గదర్శకాలు అమలులో ఉన్నప్పటికీ భారత్ ఇందులో భాగస్వామి కాలేకపోయిందని గోయెల్ స్పష్టం చేశారు. ఆర్‌సీఈపీ దేశాలతో ఇప్పటికే భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని, ఇందులో ఆసియాలోని 10 దేశాల్లో జపాన్, కొరియా సైతం ఉన్నాయని తెలిపారు. అలా గే ఆస్ట్రేలియాతో సైతం సంప్రదింపులు జరుగుతున్నాయని, రానున్న ఎనిమిది నెలల్లో ఆస్ట్రేలియాతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం ముగుస్తున్న దృష్ట్యా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రధానంగా చైనా-్భరత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు ఆర్‌సీఈపీ నిబంధనలు దోహదం చేశాయని తెలిపారు. తమ ప్రభు త్వం తెరిచిన పుస్తకంలా పనిచేస్తోందని, అధిక పారదర్శకత, నియంత్రణ చట్టాల అమలు విధానం అనుసరిస్తోందని, ఇవన్నీ పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. కేవలం డెడ్‌లైన్ల విధింపు, తొందరపాటుతో వాణిజ్య ఒప్పందాలు జరగాలంటే సాధ్యం కాదని, సంప్రదింపులకు ఓ ప్రత్యేకత ఉందని వ్యాఖ్యానించారు. కాగా భారత ఆర్థిక వ్యవస్థపై రుణ భారాల ప్రభావం గురించి ఈ సందర్భంగా విలేఖరులు గోయెల్ వద్ద ప్రస్తావించగా స్పం దించిన ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ ఈ సమస్య త్వ రలో పరిష్కారానికి వస్తుందన్నారు. బ్యాంకులను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు.