బిజినెస్

గిరిజనుల ఉత్పత్తుల విక్రయానికి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: గిరిజనులు తయారు చేసిన వస్తువులను దేశీయ, ప్రపంచ మార్కెట్లలో విక్రయించడానికి, మార్కెటింగ్ చేయడానికి గల మార్గాలను అనే్వషించే పనిలో ప్రభుత్వం నిమగ్నమయి ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు. ఇందులో భాగంగా గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను గుర్తించడంతో పాటు వాటికి ప్రమాణాలు ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఇప్పటికే గిరిజన వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో, భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్)తో, సీఐఐ వంటి సంస్థలతో చర్చలు జరిపిందని వారు తెలిపారు.
‘దేశీయ, ప్రపంచ మార్కెట్లలో గిరిజనుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తొలుత సుమారు వంద ఉత్పత్తులను గుర్తించడం జరుగుతుంది. మార్కెటింగ్ మద్దతు కోసం పెద్ద సంఖ్యలో రిటెయిల్ చైన్లను గుర్తించడం జరుగుతుంది’ అని ఆ అధికారి వివరించారు. ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ప్రమాణం, నాణ్యత ఎంతో ముఖ్యం.
అందువల్ల ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలు, నాణ్యత గలవిగా తీర్చిదిద్దే పనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండార్డ్స్, క్వాలిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపడతాయి. ఒక వినియోగదారుడిగా, విక్రయానికి తోడ్పడే సంస్థగా రైల్వేల్లో ఉన్న మార్గాలను అనే్వషించడం జరుగుతుందని ఆ అధికారి వివరించారు.