బిజినెస్

పైపులైన్ల కోసం 45వేల కోట్ల పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: గెయిల్ ఇండియా లిమిటెడ్ రానున్న అయిదేళ్లలో నేషనల్ గ్యాస్ పైప్‌లైన్ గ్రిడ్, సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రూ. 45వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది. దీనివల్ల పర్యావరణ సహిత ఇంధనమయిన గ్యాస్ వినియోగం బాగా పెరుగుతుందని అంటున్నారు.
దేశ ఇంధన బాస్కెట్‌లో ప్రస్తుతం 6.2 శాతం ఉన్న సహజ వాయువు వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు సహజ వాయువును తీసికెళ్లడానికి, దక్షిణ భారత దేశంలోని వినియోగదారులకు దీనిని అందించడానికి గ్యాస్ పైప్‌లైన్లు వేయాలని ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.