బిజినెస్

నికర లాభం రూ. 4146 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సంర మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం సుమారు రెండింతల కంటే ఎక్కువగా పెరిగింది. డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన 2019-2020 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నివేదికను బీఎస్‌ఈకి బ్యాంక్ దాఖలు చేసింది. దీని ప్రకారం, బ్యాంక్ 4,146.46 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలానికి నికర లాభం 1,604.91 కోట్ల రూపాయలు. మొత్తం ఆదాయం 17.23 శాతం లేదా 23,638.26 కోట్ల రూపాయల మేర పెరిగింది. గత ఏడాది ఈ మొత్తం 20,163.25 కోట్ల రూపాయలు. అదే విధంగా నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) బ్యాంక్ తగ్గించుకోగలిగింది. 2018 డిసెంబర్ 31వ తేదీ నాటికి నిరర్ధక ఆస్తులు 7.75 శాతం ఉంటే, గత ఏడాది అదే తేదీ నాటికి ఈ ఆస్తులు 5.95 శాతానికి తగ్గాయి. వడ్డీ ఇప్పుడు 3.77 శాతంగా నమోదుకాగా, 2018 సెప్టెంబర్‌లో అది 3.64 శాతం. పన్నులుసహా ఇతరత్రా చెల్లింపులు లేదా ఖాతాల కింద జరిగే కేటాయింపులు 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 4,244 కోట్ల రూపాయలుగా ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది 2,083 కోట్ల రూపాయలకు తగ్గింది.