బిజినెస్

అనిశ్చితితో నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో ఏఏ అంశాలకు ప్రాధాన్యం ఉంటుందో? ఏఏ రంగాలు నిర్లక్ష్యానికి గురవుతాయో అంచనా వేయడంలో నిపుణులు సైతం విఫలమవుతున్నారు. దీనితో అనిశ్చితి కొనసాగిన నేపథ్యంలో, ఈవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. చివరి రెండు రోజులు పరిస్థితి మెరుగుపడకపోతే, అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు కోలుకోలేని దెబ్బతినేవారు. బాంబా స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఈవారం 332.18 పాయింట్లు నష్టపోయింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీకి 104.10 కోత పడింది. చైనా, అమెరికా వాణిజ్య సంబంధాలు మెరుగు పడకపోవడం, ఇరాన్‌పై అమెరికా కఠినంగా వ్యవహరించే సంకేతాలు వెలువడడం వంటి పలు అంతర్జాతీయ అంశాలు మిగతా మార్కెట్ల మాదిరిగానే భారత స్టా క్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపాయి. మదుపరుల యాంటీ సెంటిమెంట్ కారణంగా, ఈవారం ట్రేడింగ్‌కు మొదటి రోజైన సోమవారం సెనె్సక్స్ భారీ కుదుపులను ఎదుర్కొంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి 416.46 పాయింట్లు నష్టపోయి, 41,528.91 పాయింట్ల దిగువన స్థిరపడింది. అదే విధంగా నిఫ్టీ 127.80 పాయింట్లు తగ్గడంతో, 12,224.55 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఈవారం ప్రారంభంలోనే నష్టాలను ఎదుర్కోవడం సహజంగానే అందరినీ ఆందోళనకు గురి చేసింది. కాగా, ఈ పతనం మంగళవారం కూడా కొనసాగింది. సో మవారం మాదిరిగానే మార్కెట్లలో అస్థిరత్వం స్పష్టంగా కనిపించింది. చివరికి 205.10 పాయిం ట్లు కోల్పోయిన సెనె్సక్స్ 41,323.81 పాయింట్లుగానూ, 54.70 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,169.85 పాయింట్లుగానూ నమోదయ్యాయి. వరుసగా రెండు రోజుల నష్టాలను ఎదుర్కొన్న మా ర్కెట్లు మూడో రోజున కూడా కోలుకోలేకపోయా యి. సెనె్సక్స్ 208.43 పాయిం ట్లు నష్టపోయి 41,115.38 పాయింట్లకు, నిఫ్టీ 62.95 పాయింట్లు కోల్పోయి 12,106.90 పాయింట్లకు పడిపోయా యి. మొత్తం మీద మూడు రోజుల పాటు బేర్ ఆధిపత్యం కొనసాగితే, చివరి రెండు రోజులు స్థానిక మదుపరులతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లపై ఆసక్తిని ప్రదర్శించడంతో మార్కెట్లు కోలుకున్నాయి. గురువారం రోజున, ఒకానొక దశలో భారీ లాభాలపై ఆశలు పెంచినప్పటిటీ, ఆతర్వాత దూకుడు తగ్గింది. కానీ, 271.02 పాయింట్ల ఎగువకు వెళ్లిన సెనె్సక్స్ 41,386.40 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ 73.45 పాయింట్లు పెరగడంతో, 12,180.35 పాయింట్లుగా నమోదైంది. మార్కెట్లకు చివరి రోజైన శుక్రవారం సైతం మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. సెనె్సక్స్ 225.79 పాయింట్లు పెరిగి, 41,613.19 పాయింట్ల కు, నిఫ్టీ 67.90 పాయింట్లు మెరుగుపడి 12,248.25 పాయింట్లకు చేరాయి. చివరి రెండు రోజులు ఊర ట లభించినప్పటికీ, స్థూలంగా చూస్తే ఈ వారం మార్కెట్లు నిరాశనే మిగిల్చాయి. సెనె్సక్స్ 332.18 పాయింట్లు నష్టపోతే, సెనె్సక్స్ 104.10 పాయింట్లు కోల్పోయింది. ఐటీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, స్టీల్ రం గాలకు చెందిన కంపెనీలు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడు లాభాలను ఆ ర్జిస్తాయో, ఎప్పుడు నష్టాలను చవిచూస్తాయో ఎవ రూ చెప్పలేని పరిస్థితి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అప్పటి వరకూ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు తప్పవని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు.