బిజినెస్

గణనీయంగా పెరగనున్న గిడ్డంగుల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 26: సాంకేతికాభివృద్ధి, సంస్కరణల కారణంగా వస్తు, సరకు రవాణా, నిల్వలతో కూడిన ‘సమగ్ర లాజిస్టిక్స్ నెట్‌వర్క్’ విస్తరిస్తున్న దృష్ట్యా దేశీయంగా గిడ్డంగుల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది ఈ రంగం ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ గిడ్డంగుల వినియోగం 40 మిలియన్ చదరపు అడుగుల మేర అదనంగా విస్తరించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్ధ ‘సావిల్స్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. ముంబయి, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహమ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో 2020లో ఈ గిడ్డంగులు అదనంగా మరో 35 మిలియన్ చదరపు అడుగుల మేర లబ్ధిపొందే అవకాశాలున్నాయని ఆ నివేదిక తెలిపింది. 2019లో ఈ గిడ్డంగులు మొత్తం 37.94 మిలియన్ చదరపు అడుగుల మేర సరకు సరఫరాతో లబ్ధిపొందాయని తెలిపింది. ప్రధానంగా స్థిరాస్తి రంగంలో ఈ గిడ్డంగుల ప్రాధాన్యత పెరుగుతోందని, సంస్థాగత మదుపర్లు, డెవలపర్లు అధికంగా పాలుపంచుకుంటున్నారని తెలిపింది.
ఆర్థిక, రీటెయిల్, ఎఫ్‌ఎంసీజీ, థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజీ, పార్మా, తయారీ రంగాల్లో వేర్‌హౌసింగ్ విస్తరిస్తోందని సావిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా, సరళీకృత పన్ను విధానం జీఎస్టీ, ఎఫ్‌డీఐ విధానం, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి చర్యలతో బాటు రహదారి, పోర్టుల వౌలిక సదుపాయాలు పెరగడం వేర్‌హవుసింగ్‌కు బాసటగా మారిందన్నారు.