బిజినెస్

మార్కెట్లకు కరోనా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 27:కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. గత నాలుగు నెలల్లో రెండోసారి స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సోమవారం జరిగిన లావాదేవీల్లో బీఎస్‌ఈ సెనె్సక్స్ 458.07 పాయింట్లు నష్టపోయి 41,155.12 వద్ద ముగిసింది. ఒకదశలో దాదాపు 500 పాయింట్ల వరకు మార్కెట్ నష్టపోయే పరిస్థితి తలెత్తింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 1.06 శాతం అంటే 129.25 పాయింట్లు నష్టపోయి 12,119 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో టాటా స్టీల్ షేర్లు అత్యధిక స్థాయిలో 4.31 శాతం మేర నష్టపోయాయి. అలాగే, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్ తదితర షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి. సెనె్సక్స్‌లో లిస్టయిన కంపెనీల్లో 21 కంపెనీలు నష్టాల్లోనూ 9 కంపెనీలు లాభాల్లోనూ ముగిశాయి. ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు 1.63 శాతం మేర లాభపడ్డాయి. సెక్టార్లవారిగా చూస్తే బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ 3.25 శాతం మేర నష్టపోయాయి. టెలికాం, పవర్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు కూడా నష్టాలను చవిచూశాయి. మరోపక్క హెల్త్‌కేర్ సూచీ బలంగా పుంజుకుంది. కరెన్సీ విషయానికొస్తే అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి మరో 11 పైసలు నష్టపోయి 71.44 వద్ద ముగిసింది. న్యూమోనియా తరహా తీవ్ర అనారోగ్యానికి దారితీసే కరోనా వైరస్ ప్రభావం ఒక్క భారతీయ మార్కెట్‌పైనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లనూ ప్రభావం చూపింది. ఈ వ్యాధి తీవ్రత ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కీ 2 శాతం మేర నష్టపోయింది. అలాగే అనేక ఐరోపా మార్కెట్లు పేలవంగా మొదలయ్యాయి.
అమెరికా డాలర్ మారక విలువతో భారత రూపాయి నష్టపోవడం వరుసగా ఇది మూడోరోజు. ఇప్పటివరకు మొత్తం 24 పైసలు నష్టపోయింది. అయితే, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అందించే బడ్జెట్‌ను బట్టి రూపాయి బలపడడానికి బలమైన సంకేతాలు అందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.