బిజినెస్

బ్యాంకర్ల నిర్ణయాలకు ప్రభుత్వం బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రభుత్వ రంగ బ్యాంకర్లు తీసుకున్న వివేకవంతమైన వాణిజ్య పరమైన నిర్ణయాలను సమర్థించి ప్రోత్సహించేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. మోసాలకు పాల్పడిన అధికారులపై వచ్చే ఫిర్యాదులపై చర్యలకు అత్యున్నత పాలకవర్గ అధికారుల పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలోప్రత్యేకిం చి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వ్యక్తిగత బాధ్యతలను పెంచేందుకు నిర్ణయించింది. ఈక్రమంలో కేంద్ర ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్) కొన్ని ప్రత్యేక అధికారాల ను ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులకు బదలాయించడం జరిగింది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), సీవీసీ సర్క్యులర్లలో పొందుపరచిన కాలవ్యవధిలోగా సమస్య ల పరిష్కారానికి సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ (మెకానిజం)ను ఆ బ్యాంకుల బోర్డులు నిర్దేశించుకోవాల్సి ఉంది. 2015లో కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ (డీఎఫ్‌ఎస్) జారీ చేసిన ఆదేశాల మేరకు రూ. 50 కోట్లకు పైబడిన మోసాలకు సంబంధించిన అన్ని నిరర్థక అకౌంట్లను తప్పనిసరిగా పరిశీల జరపాల్సి ఉంది. అంతేకాకుండా వీటన్నిటినీ 2020 జనవరి 15 సీవీసీ సర్క్యులర్‌తో అనుసంధానించాల్సి ఉంది. మోసాలు జరిగాయన్న అనుమానం ఉ న్న కేసులను తొలుత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మోసాల సలహా బోర్డు (ఏబీబీఎఫ్‌ఎఫ్)కు రెఫర్ చేయాల్సి ఉంటుంది.