బిజినెస్

కంపెనీల రద్దుకు సరికొత్త నిబంధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: కంపెనీల చట్టం ద్వారా నష్టాల్లో ఉన్న వివిధ కంపెనీలను మూసివేసేందుకు సంబంధించిన సరికొత్త నిబంధనలను కేంద్ర ప్రభు త్వం నోటిఫై చేసింది. జాతీయ కంపెనీల న్యాయ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి పనిభారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సరికొత్త కంపెనీల ముగింపునిబంధనలు 2020’కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ సరికొత్త నిబంధనలు అమలోకి రానున్నాయి. కంపెనీల రద్దుకు సంబంధించిన వివిధ రకాల పిటిషన్లు ఎన్‌సీఎల్‌టీ వద్ద వివిధ దశల్లో పేరుకుని ఉన్నాయి. అందులో టర్నోవర్, చెల్లించిన మూలధనానికి సంబంధించిన కేసుల వంటివి అనేకం ఉన్నాయి. ఈ నిబంధనల ద్వారా ప్రధానంగా లిక్విడేషన్ (ద్రవ్య లభ్యత)కోసం కేంద్రానికి ఫైల్‌చేసే సమ్మరీ ప్రక్రియకు సంబంధించిన బాధ్యతల్లో ఎన్‌సీఎల్‌టీకి వెసులుబాటు కలుగుతుందని న్యాయ సలహాదారు అఖిల అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ డ్రాఫ్ట్ నిబంధనలన్నీ చిన్న కంపెనీలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి కావడం గమనార్హం. బుక్ వాల్యూ రూ. కోటికి మించ ని కంపెనీలు ఈ నిబంధనలను వినియోగించుకునే వీలుంది. అలాగే ఆ కంపెనీలు రూ. 25 లక్షలకు మించి డిపాజిట్లు సేకరించి ఉండకూడదు. రూ. 50 లక్షలకు మించి అన్ సెక్యూర్డ్ రుణాలను తీసుకుని ఉండకూడదు. లేదా పెయి డప్ కేపిటల్ రూ. కోటికన్నా తక్కువగా ఉండాలని నోటిఫికేషన్ వివరించింది. కాగా ప్రస్తుతం స్వచ్ఛంద లిక్విడేషన్ కేసులు ప్రాథమికంగా దివాళా, బ్యాం కుల మోసాల నియంత్రణ శిక్షా స్మృతి (ఐబీసీ) పరిధిలో నమోదవుతున్నాయి.