బిజినెస్

ఎన్‌ఐఐటీ టెక్ త్రైమాసిక లాభాల్లో 23% వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ఐటీ దిగ్గజ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ బుధవారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గడచిన 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి 66.29 శాతం వృద్ధితో రూ. 123.3 కోట్ల ఏకీకృత లాభాలను ఆర్జించినట్టు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 100.2 కోట్ల ఏకీకృత లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. కాగా ఎన్‌ఐఐటీ టెక్నాజీస్ ఆపరేటర్ల నుంచి వచ్చే ఆదాయం సైతం 11.8 శాతం వృద్ధితో రూ. 1,088 కోట్లుకు చేరిందని వివరించింది. గడచిన ఏడాది ఈ రాబడి రూ. 973.3 కోట్లుగా ఉందని తెలిపింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయంలో అమెరికా నుంచి వచ్చిన ఆదాయమే అధికమని ఆ దేశం నుంచి వచ్చే ఆదాయం సైతం ఈ త్రైమాసికంలో 10 శాతం పెరిగిందని, అలాగే ఐరోపా దేశాలతో వాణిజ్యం సైతం 23 శాతం పెరిగిందని అమెరికా, ఐరోపాల్లో పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన లాభాల్లో కంపెనీ అత్యధిక వృద్ధిరేటును నమోదు చేసిందని అధికారులు తెలిపారు. ఐతే మన దేశంలోనూ, పశ్చిమాసియా ప్రాంతంలోనూ కంపెనీకి ఆపరేషనల్ లాభాల్లో తగ్గుదల చోటుచేసుకుందని వెల్లడించారు. కాగా ప్రతి వాటాపై ఈ సందర్భంగా కంపెనీ రూ. 10ని డివిడెండ్‌గా ప్రకటించింది.