బిజినెస్

ఐటి, స్టార్టప్స్‌లో మేమే మార్గదర్శకులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ఐటి రంగానికి దేశానికి, దశ, మార్గదర్శనం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, స్టార్టప్‌ల ప్రభంజనం ఇక్కడే నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటి విధానం, స్టార్టప్‌ల పాలసీ దేశ, విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని, అనేక పెద్ద కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హైసే) 24వ వార్షిక సదస్సు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్‌లో స్టార్ట్‌ప్స్ పెరుగుదలకు దోహదపడుతుందని హైసే అధ్యక్షుడు రమేశ్ లోగనాథన్ చెప్పారు. గురువారం నాడిక్కడ ఎస్‌టిపిఐ, హైసే సంయుక్తంగా నిర్వహించిన ‘హైసే 24వ వార్షిక సదస్సు, 2016 అవార్డుల ప్రదానోత్సవాన్ని’ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా లోగనాథన్ మాట్లాడుతూ, కొత్త ఆవిష్కరణలు, ఉత్పాదనలకు ఈ సమ్మిట్ వేదిక అవుతుందని చెప్పారు. సమ్మిట్ కారణంగా స్టార్ట్‌ప్స్ ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. హైసే ప్రొడక్ట్స్ ఫోరమ్ లీడర్ శేషారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ వేదిక ఏర్పాటు వల్ల హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అన్నారు. ఈ ప్రదర్శనలో 180 సాఫ్ట్‌వేర్ ఉత్పాదనలు పాల్గొని, 15 అవార్డుల కోసం పోటీపడ్డాయని తెలిపారు. ఐటి దిగ్గజం బివిఆర్ మోహన్ రెడ్డి, మనోజ్ శర్మ, కార్తికేయన్ ఎం, ధీరజ్ శర్మ, నటరాజన్ రంగనాథన్, శక్త సాగర్,. సుదారక్ ఆల్వే, రాజేంద్రసింగ్ పవార్ , డ్రమ్స్ శివమణి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం ‘హైసే’ వార్షిక సదస్సులో పాల్గొన్న మంత్రి కెటిఆర్ ప్రభృతులు