బిజినెస్

ఉత్పత్తుల నాణ్యత పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నాణ్యతాయుతమైన ఎగుమతులపైనే దృష్టి పెట్టాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారంనాడు ఇక్కడ పిలుపునిచ్చారు. ముడి వస్తువులను కాకుండా విలువ చేర్చిన ఉత్పత్తుల ఎగుమతుల ద్వారానే వైవిధ్యాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. ఇనుప ఖనిజానికి బదులు అత్యంత నాణ్యతాయుతమైన ఉప్పును ఎగుమతి చేయాలని, ఈ రకమైన ఉత్పత్తుల వల్ల అంతర్జాతీయంగా భారత ఎగుమతుల పరిమాణం పెరుగుతుందని తెలిపారు. అనేక ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటా అత్యంత కనిష్టంగానే ఉందని, దీని దృష్ట్యా జౌళి, ఫిషరీస్, ఐటీ రంగాల ఎగుమతులపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ సంస్థలు మరింతగా విస్తరించి భారత్‌ను అగ్రస్థాయికి తీసుకువెళ్లాలని అన్నారు. స్వదేశీ ఆశయంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వం దేశీయ ఇనె్వస్టర్లకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని అనుకూలంగా మార్చుకుని భారత్ తన ఎగుమతులను మరింతగా పెంచాలని అన్నారు. ఈ వాణిజ్య యుద్ధం వల్ల భారత్‌లో ఏఏ కంపెనీలు ఎగుమతుల పరంగా లాభాన్ని పొందుతాయన్న దానిపై దృష్టి పెట్టామని అన్నారు. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న వాల్‌మార్ట్ డిమాండ్‌కు తగ్గట్టుగా దేశీయ ఉత్పత్తులను పెంచుకోలేకపోతున్నామని, ఈ సంస్థ 40వేల చెప్పుల జతలను అడిగితే దేశంలోని ఓ పెద్ద కంపెనీ ఓ ఏడాదికాలంలో 20వేల చెప్పుల జతలను మాత్రమే ఉత్పత్తి చేయగలనని స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తుల స్థాయిలను పెంచుకోకపోతే వెనుకబడిపోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దేశీయ ఇనె్వస్టర్లను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే కూడా ఎక్కువ మొత్తానే్న ఇనె్వస్ట్ చేయాలని వీటిని కోరుతున్నామని అన్నారు. దశలవారీగా వివిధ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి దేశీయంగానే ఉత్పత్తుల స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అయితే, ఈ విషయంలో తమకు ఎదురయ్యే సమస్యలు ఏమిటో పరిశ్రమ వర్గాలే ప్రభుత్వం దృష్టికి తేవాలని, ముఖ్యంగా తనిఖీ అధికారుల వల్ల తలెత్తే ఇబ్బందులను వెల్లడించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌పరంగా అందుబాటులో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా దేశీయ పరిశ్రమలు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ తమ ఉనికిని చాటుకోగలుగుతాయని తెలిపారు.

*చిత్రం... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్