బిజినెస్

నాలుగో రోజూ అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఏజీఆర్ వ్యవహారం టెలికాం ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. లావాదేవీలు ప్రారంభంలో తీవ్రంగా నష్టపోయిన సెనె్సక్స్ అనంతరం కొంతమేరకు కోలుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 161.31 పాయింట్లు నష్టపోయి 40,894.38 వద్ద ముగిసింది. ఒకదశలో 444 పాయింట్లు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా మొదట్లో భారీగా నష్టపోయినా అనంతరం 53.30 పాయింట్లు కోల్పోయి అంతిమంగా 11,992.50 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో భారతీ ఎయిర్‌టెల్ అత్యధిక స్థాయిలో 3 శాతం మేర నష్టాన్ని చవిచూసింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా నుంచి బలవంతంగా బాకీలను వసూలు చేసే విషయంలో టెలికాం విభాగాన్ని నిరోధించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో దాని ప్రభావం నేటి లావాదేవీల్లో వొడాఫోన్ ఐడియా షేర్లపై తీవ్రంగా కనిపించింది. దాదాపుగా ఈ కంపెనీ షేర్ విలువ 16 శాతం మేర నష్టపోయింది. టెలికాం రంగం ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బాకీల ప్రభావం బ్యాంకింగ్ షేర్లపైన కనిపిస్తోందని, ఆ విధంగా మార్కెట్ పనితీరును ఇది ప్రభావితం చేస్తోందని విశే్లషకులు చెబుతున్నారు. కాగా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు ప్రధానంగా పుంజుకున్నాయి. సెక్టార్ వారీగా చూస్తే టెలికాం రంగమే దాదాపు 4 శాతం నష్టపోయింది. మెటల్, ఆటో, రియల్టీ సూచీలు కూడా ఈ ప్రభావానికి లోనయ్యాయి. చైనా మినహా అనేక ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి. ఇందుకు ప్రధాన కారణంగా కరోనా వైరస్ తీవ్రతేనని చెబుతున్నారు.