బిజినెస్

ఆర్థికాభివృద్ధికి అవకాశాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 22: భారత్ ఆర్థికాభివృద్ధికి అమెరికా అనేక అవకాశాలు కల్పిస్తుందా? భారత్‌తో ఆర్థికాభివృద్ధి, సత్సంబంధాలు కొనసాగించేందుకు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని పరిపాలనా యంత్రాంగం కృషి చేస్తుందా? ప్రస్తుతం దేశమంతటా ఇదే చర్చ కొనసాగుతున్నది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ భారత్‌కు రానున్న నేపథ్యంలో, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రత్యేకించి వాణిజ్య ఒప్పందాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కొంతకాలంగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు, ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పలు రకాల ఉత్పత్తులపై భారత్ టారీఫ్‌లను భారీగా పెంచడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆక్షేపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వాణిజ్య రంగంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి సంతోషకరంగా లేదని ఈవారం ప్రారంభంలోనే వ్యాఖ్యానించారు. అయతే, భవిష్యత్తులో ఇలా జరగరాదని అమెరికా భావిస్తున్నది. ఇందుకు తగినట్టు భారత్ చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉంది. భారత్‌కు చేరుకున్న అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకం విధిస్తున్నారన్నది అమెరికా వాదన. కానీ, భారత్ మాత్రం అంతర్జాతీయ టారిఫ్‌ను అనుసరించే పన్నులను విధిస్తున్నట్టు విమర్శస్తున్నది. ఈ వివాదం నేపథ్యంలోనే, ఈ ఏడాది జూన్ 5న జీఎన్‌పీ (జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫెరెన్స్‌స్) కార్యక్రమం నుంచి భారత్ హోదాను అమెరికా రద్దు చేసింది. దీనికి ప్రతికారంగా 28 రకాల అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్ భారీగా సుంకాన్ని పెంచింది. జీఎన్‌పీ అనేది అమెరికాలోని అతి విస్తృతమైన, పురాతనమైన వాణిజ్య కార్యక్రమం. దీనిని అనుసరించే వివిధ దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. అదే విధంగా రాయతీలను కల్పిస్తుంది. ఈ జాబితా నుంచి భారత్‌ను అమెరికా తొలగించడం, లేదా హోదాను రద్దు చేయడం సహజంగానే ఇరు దేశాల మధ్య మైత్రీ సంబంధాలను దెబ్బతీస్తుంది. కాగా, అమెరికా నుంచి అసిస్టెంట్ యూఎస్ ప్రతినిధి (ఎయుఎస్‌టీఆర్) క్రిస్ట్ఫోర్ విల్సన్ భారత్‌కు చేరుకుని న్యూఢిల్లీలో వాణిజ్య విభాగం ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. భారత్ ఆర్థికాభివృద్ధి కోసం తమ దేశం గట్టిగా కృషి చేస్తున్నదని ఆయన ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు కొనసాగిద్ధామని, భారీ సుంకాలు వద్దని ఆయన కోరారు. అందుకు భారత్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. అయతే, సుంకాలను తగ్గిస్తున్నట్టు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలావుంటే, ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగిందని అమెరికాలోని భారత దౌత్యవేత్త హర్షవర్దన్ ప్రకటించారు. 2025 సంవత్సరం నాటికి యూఎస్‌డి 238 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. మొత్తానికి భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకోరాదన్నది అమెరికా అభిప్రాయంగా కనిపిస్తున్నది. మొత్తం మీద ట్రంప్ పర్యటనలో ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చి, పరిష్కారం దిశగా చర్యలు మొదలవుతాయన్న ఆశాభావం వాణిజ్య వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
*చిత్రం... అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్