బిజినెస్

ఆరు టాప్ కంపెనీల మార్కెట్ విలువ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: దేశంలోని ‘టాప్-10’ కంపెనీల జాబితాలోని ఆరు కంపెనీల మార్కెట్ విలువ గత వారం 29,487 కోట్ల రూపాయల మేర పతనమైంది. అత్యధికంగా నష్టపోయిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో ఉంది. టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్ (టీసీఎస్), హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) కూడా నష్టాలను చవిచూశాయి. కాగా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ పెరిగింది. మార్కెట్ గణాంకాల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ గత వారం 10,692.90 కోట్ల రూపాయలు తగ్గడంతో 2,97,600.65 కోట్ల రూపాయలకు చేరింది. అదే విధంగా టీసీఎస్ 10,319.06 నష్టంతో 8,09,126.71 కోట్ల రూపాయల వద్ద స్థిరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ 5,162.75 కోట్లు తగ్గడంతో, 4,10,062.89 కోట్ల రూపాయలకు పతనమైంది. హెచ్‌యూఎల్ విలువ 1,515.37 కోట్ల పతనంతో 4,86,617.28 కోట్ల రూపాయలకు చేరగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ 1,068.34 తగ్గడంతో 6,66,914.28 కోట్లకు పడిపోయింది. రిల్ విలువ 729.01 కోట్లు తగ్గి, 9,41,693.57 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇలావుంటే, ఇన్ఫోసిస్ విలువ 4,471.59 కోట్ల రూపాయలు మెరుగుపడడంతో, 3,39,287.61 కోట్ల రూపాయలకు చేరింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ విలువ 956.14 కోట్లు లాభపడి 3,22,542.94 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ 5,863.46 కోట్ల విలువను పెంచుకొని, 2,93,666.38 కోట్ల రూపాయలకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ 541.78 కోట్ల రూపాయలు బలపడి, 3,53,766.96 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇలావుంటే, దేశంలోని అత్యంత విలువైన కంపెనీల లిస్టులో రిల్ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. ఆతర్వాతి స్థానాలను వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ఆక్రమించాయి. గత వారంలో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 86.62 పాయింట్లు నష్టపోయాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు కావడంతో, గత వారం నాలుగు రోజులు మాత్రమే స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు జరిగాయి.