బిజినెస్

బకాయిల ఊబిలో ‘టెలికం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: భారత టెలికం రంగం బకాయిల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. దీని నుంచి బయటపడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆదివారం టెలికంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమై, ప్రస్తుత పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, సమావేశం వివరాలను టెలికాం అధికారులు ఎవరూ బయటపెట్టలేదు. నీతీ ఆయోగ్ ఉన్నతాధికారులు కొందరు పీటీఐతో మాట్లాడుతూ, బకాయిల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడుతున్న టెలికం కంపెనీలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్), లైనెన్స్ తదితర బకాయిలను దేశంలోని టెలికం కంపెనీలు చెల్లించాల్సి ఉంది. 1.47 లక్షల కోట్ల రూపాయల ఈ బకాయిను వెంటనే చెల్లించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బకాయిల్లో ఏజీఆర్ కింద 92,642 కోట్ల రూపాయలు, లైసెన్స్ ఫీజు ఇతరాల కింద 55,054 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉంది. స్పెక్ట్రం సేవలను వినియోగించుకున్నందుకు గాను ఈ మొత్తాలను టెలికం కంపెనీలు చెల్లించాల్సి ఉంది. బకాయిల్లో భారతీ ఎయిర్‌టెల్, ఒడాఫోన్ ఐడియా కంపెనీల వాటా ఏకంగా 60 శాతం. భారతీ ఎయిర్‌టెల్ సుమారు 35,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇటీవలే 10,000 కోట్ల రూపాయలను చెల్లించింది. వొడాఫోన్ ఐడియా ఇంత వరకూ చెల్లించిన మొత్తం 3,500 కోట్లు మాత్రమే. టాటా టెలీ సర్వీసెస్ 2,197 కోట్ల రూపాయలు చెల్లించింది. అక్టోబర్ వరకూ లెక్కగట్టి, టెలికం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాలను 1.47 లక్షల కోట్ల రూపాయలుగా సుప్రీం కోర్టు ప్రకటించగా, ఆలస్యంగా చెల్లింపులు, పెనాల్టీలు, వడ్డీలు కలిపి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాలను చెల్లించడం కష్టమని, ఇప్పటికే పలు కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని టెలికం కంపెనీలు వాపోతున్నాయి.
ప్రభుత్వం నడుం బిగించి, సత్వర చర్యలు తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పన్నుల భారాన్ని తగ్గించి, పరిశ్రమను కాపాడాల్సిందిగా కేంద్రాన్ని టెలికం దిగ్గజం, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కోరిన విషయం తెలిసిందే. వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం కూడా మిట్టల్‌తో గొంతు కలిపారు. సత్వర చర్యలు తీసుకోకపోతే, టెలికం రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతున్నందువల్లే ఆదివారం టెలికం శాఖతోపాటు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కేంద్రం ముందు ఉంచనున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.