బిజినెస్

15,644 వాహనాల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రఖ్యాత కొరియా మోటార్ వాహన దిగ్గజ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి భారత్‌లో 15,644 వాహనాలను విక్రయించినట్టు సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తంలో 10,024 యూనిట్ల సెల్టోస్, 1,620 యూనిట్ల కార్నివాల్ వాహనాలు ఉన్నాయని తెలిపింది. వాహనాల తయారీలో తమ సంస్థ భారత్‌లో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొంది. ‘మా సంస్థ ద్వారా ఇటీవల కొత్తగా విడుదల చేసిన కార్నివాల్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోయాయి’ అని కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ కూక్యున్ షిమ్ తెలిపారు. కియా వాహనాలకు సంబంధించిన డిజైన్ నాణ్యత, విశ్వసనీయతకు ఇది నిదర్శనమే కాకుండా భారత మార్కెట్‌లో తమ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ కూడా అద్దం పడుతోందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని పేర్కొన్న ఆయన ఏడాది పొడుగునా తమ వాహనాలకు ఇదే స్థాయి డిమాండ్ ఉండగలదన్న ధీమాను వ్యక్తం చేశారు.