బిజినెస్

సేఫ్టీగా శ్రీసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/వరదాయపాళెం , మార్చి 4: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామిక భద్రతకు పిలుపునిస్తూ శ్రీసిటీ హెచ్‌ఆర్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీసిటీలో తలపెట్టిన ఇండస్ట్రియల్ సేఫ్టీ వాకతాన్ 2020 విజయవంతంగా నిర్వహించారు. అత్యధికంగా మహిళా కార్మికులతో భద్రత నినాదాల నడుమ ఎంతో ఉత్సాహంతో ఈ వాకతాన్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు జీరో పాయింట్ వద్ద ఉన్న మైదానం నుంచి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి, సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ముత్తురాజ్, శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారి ఈ మారతాన్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లోని 100 పరిశ్రమల నుంచి వేలాది ఉద్యోగులు జీరో పాయింట్ నుంచి కొబెల్కో కూడలి వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నడక సాగించారు. దేశంలో ఇదే అతిపెద్ద పారిశ్రామిక నడకగా శ్రీసిటీ వాకతాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సీనియర్ ప్రతినిధి వివేక్ నాయర్ జడ్జిగా దీన్ని నిర్ధారిస్తూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్ఞాపిక, ప్రశంశపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా వివేక్‌నాయర్ మాట్లాడుతూ భద్రత ప్రాముఖ్యతను గుర్తించి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు. గత పదేళ్లలో పరిశ్రమలలోపల ప్రమాదం ద్వారా ఒక్క మరణం కూడా సంభవించకపోవడం శ్రీసిటీ రికార్డుగా ఆయన పేర్కొన్నారు.
*చిత్రాలు.. *ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్ఞాపిక, ప్రశాంస పత్రాన్ని అందుకుంటున్న శ్రీసిటీ ఎండీ
*శ్రీసిటీలో వాకతాన్ నిర్వహిస్తున్న దృశ్యం