బిజినెస్

కరోనా ఎఫెక్ట్‌తో మాస్క్‌ల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మార్చి 5: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నగరవాసులకు కంపితులను చేస్తోంది. జర్మనీ నుండి నగరానికి వచ్చిన వ్యక్తిని కరోనా అనుమానంతో పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తేల్చగా స్వయంగా కలెక్టర్ ఇంతియాజ్ విషయాన్ని ప్రకటించడంతో నగరవాసులు ఊపిరిపీలుకున్న విషయం విదితమే. అయితే నగరంలో పొల్యూషన్ మాస్క్‌ల కొరత తీవ్రంగా ఉంది. బ్రాండెడ్ మాస్ ఎన్ 95 జాడే లేకుండా పోయింది. వాటి ధర రూ.125 ఉండగా నేడు రూ.వేలు పెట్టినా దొరకని స్థితి. కరోనాని దగ్గరకు రానీయకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు, వైద్యులు సూచించారు. మొట్టమొదటి చర్యగా ప్రతి ఒక్కరూ విధిగా పొల్యూషన్ మాస్క్‌లు ధరించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాస్క్‌లు తయారీ పరిశ్రమలు లేవు. హైదరాబాద్‌లో 9కంపెనీలున్నాయి. సందర్భాన్ని, అవసరాన్ని క్యాష్ చేసుకోవాలనే వారు మాస్క్‌ల ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హోల్‌సేల్ మందులు, హోల్‌సేల్ సర్జికల్స్ షాపులకు ప్రధాన కూడలిగా ఉన్న పాతబస్తీలో ఏ షాపులోనూ మాస్క్‌లు లభించడం లేదు. వ్యాపారులెవ్వరూ బయట పెట్టడం లేదు. ఉల్లిపాయలు కొరత వల్ల కర్నాటకలో ఉల్లి రైతు ఏకంగా రూ.1.40 కోట్లు గడించినట్టుగా మాస్క్‌లు అమ్మేవారు వాటిని దాచేసి అధిక ధరలకు అమ్ముకుంటారనే అనుమానంతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు గురువారం పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల కేంద్రమైన సూర్యారావుపేట, నక్కల రోడ్డు ప్రాంతంలో పలు షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాంతో వన్‌టౌన్‌లోని వ్యాపారులందరూ సమ్మె చేసిన చందంగా తమ వద్ద స్టాట్ లేదని వినియోగదారులకు తిప్పి పంపుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ మొత్తం వ్యాపిస్తున్న దరిమిలా రాష్ట్రంలో కరోనా నియంత్రణలు ఉపయోగించే మందుల 58 రకాల మందుల లభ్యతపై తనిఖీలు నిర్వహించారు. వాటి తయారీకి ఉపయోగించే ముడిసరుకు లభ్యతపై ఆరా తీయగా ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని గుర్తించారు. 26రకాల మందుల ఎగుమతులను నియంత్రిస్తూ భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓ ప్రకటనలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై ఒక సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేశారు. ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నగరంలో ప్రస్తుతం కరోనా నియంత్రణ మందుల కంటే పొల్యూషన్ మాస్క్‌ల సమస్య జఠిలంగా మారింది. సామాన్యులకు మాస్క్‌లు అందుబాటులోకి రావడంలేదు. దీనిపై భూమిలో ఫిబ్రవరి 4న ‘నగరంలో బ్రాండెడ్ పొల్యూషన్ మాస్క్‌ల కొరత’ అంటూ కథనం ప్రచురించటం విదితమే. అయితే వినియోగదారులకు మాస్క్‌లు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.