బిజినెస్

దెబ్బ తీసిన అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లతోపాటు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. దేశీయ మదుపరులు ఆదుకోవడంతో కొంత వరకు కొలుకున్నప్పటికీ, వారం మొత్తం ఫలితాలను చూస్తే నష్టాలు భారీగానే ఉన్నాయి. సెన్సెక్స్ 720.67 పాయింట్లు పతనం కావడం మార్కెట్ల పరిస్థితికి అద్దం పడుతుంది. ఈవారం ట్రేడింగ్ మొదలైన సోమవారం, అంతకు ముందు ఆరు రోజుల మాదిరిగానే కరోనా వైరస్ భారత స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. పాజిటివ్ కేసులు మన దేశంలో 30కి చేరుకున్న నేపథ్యంలో చివరి గంట లావాదేవీల్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 153 పాయింట్లను కోల్పోయిన సెనె్సక్స్ 38,144.02 వద్ద ముగిసింది. నిజానికి ఆశాజనకంగా మొదలైన లావాదేవీలు చివరి గంటలోనే నష్టాలకు దారితీశాయి. అదే విధంగా వివిధ దశల్లో ఊగిసలాడిన జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా అంతిమంగా 69 పాయింట్లు నష్టపోయి 11,132.75 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు గత ఎనిమిది రోజుల లావాదేవీల్లో ఎదుర్కొంటున్న నష్టాలకు మంగళవారం తెరపడింది. సెన్సెక్స్ 479.68 పాయింట్లు మెరుగుపడి, 38,623.70 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ 170.55 పాయింట్లు లాభపడి, 11,303.30 పాయింట్లకు చేరుకుంది. కానీ, బుధవారం నాటి ట్రేడింగ్‌పై కరోనా వైరస్ మరోసారి ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దేశంలో ఈ వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశీయ మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా కొనుగోళ్లను పాక్షికంగా నిలిపివేశారు. దీంతో సెనె్సక్స్ తీవ్ర అనిశ్చితిలో కొనసాగి, చివరకు 214.22 పాయింట్ల (0.55 శాతం) దిగువన 38,409.48 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 52.30 పాయింట్ల (0.46 శాతం) దిగువన 11,251 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం సెషన్‌లో ఆర్జించిన మంచి లాభాలను దేశంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిలకడను కోల్పోయాయ. అయతే, నష్టాల బారిన పడకుండా, స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనె్సక్స్ 61 పాయింట్లు మాత్రమే లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఎగువకు దూసుకెళ్లడం ప్రారంభించిన ఈ సూచీ ఇంట్రా-డేలో, ఒకానొక దశలో 478 పాయింట్లు పైకి ఎగబాకింది. అయితే సెషన్ ముగిసే సమయానికి క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 61.13 పాయింట్ల (0.16 శాతం) ఎగువన 38,470.61 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 18 పాయింట్ల (0.16 శాతం) ఎగువన 11,269 పాయిం ట్ల వద్ద ముగిసింది.
కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం మరోసారి దెబ్బ తీసింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారీ నష్టాలు తప్పలేదు. సనె్సక్స్ సూచీ 898.99 పాయింట్లు (2.32 శాతం) పతనమై, 37,576.62 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 279.55 పాయిం ట్లు (2.48 శాతం) పడిపోవడంతో 10,989.45 పాయింట్ల ముగిసింది. మొత్తం మీద ఈవారం స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను కరోనా వైరస్ శాసించింది. ఈ భయాందోళనలు పూర్తిగా తగ్గితేగానీ మార్కెట్లు కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు.