బిజినెస్

ఒత్తిడిలోనే మార్కెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: గత వారం నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు ఈవారం కూడా ఒత్తిడిలోనే కొనసాగే అవకాశాలున్నాయని విశే్లషకులు జోస్యం చెప్తున్నారు. కరోనా వైరస్ అత్యంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపించడం, భారత్‌లో ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతోపాటు ఎస్ బ్యాంక్ సంక్షోభం కూడా గత వారం మార్కెట్లను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించడంతో, అటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో, ఇటు జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దేశీయ మదుపరులు కొంత వరకూ ఆదుకోకపోతే, పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల సొమ్ము పదిలమేనని, ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినప్పటికీ పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ఎస్ బ్యాంక్ డిపాజిట్‌దారులు 50 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేయడానికి వీల్లేదంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో కలకలం చెలరేగింది. బ్యాంక్‌కు చెందిన వివిధ శాఖల ముందు డిపాజిట్‌దారులు బారులు తీరారు. పలు ప్రాంతాల్లో పోలీసులు రంగ ప్రవేశం చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ అనిశ్చితిలో ఇప్పటికే మార్పు లేదని, కాబట్టి, ఒత్తిడి కొనసాగే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదన్నది వాస్తవం. కాబట్టి, ఈవారం కూడా స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పవని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ సూచీలు, మదుపరుల సెంటిమెంట్లు కూడా ప్రతికూలంగానే ఉండడం కూడా వారి అనుమానాలను పెంచుతున్నాయి.