బిజినెస్

తగ్గిన ముడిచమురు రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడంతో దేశంలో పెట్రోలు ధర కూడా 71 రూపాయల దిగువకు చేరుకుంది. ఈ అంతర్జాతీయ పరిణామాల నుంచి గరిష్ట స్ధాయిలో లబ్ధిని చేకూర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా చమురు ఉత్పత్తి దేశాల మధ్య జరుగుతున్న ఈ ధరల యుద్ధంలో పూర్తిస్థాయిలో లాభం పొందాలన్న లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ముడిచమురు ధరలు దాదాపు 31 శాతానికి తగ్గడం ఇదే మొదటిసారి. ఓపెక్ దేశాల కూటమి విచ్ఛిన్నం కావడంతో సౌదీ అరేబియా, రష్యా మధ్య చమురు ధరల యుద్ధం మొదలైంది. ఒక బ్యారల్ ముడిచమురు ధర 31 డాలర్లకు పడిపోయింది. ఇది 20 డాలర్లకు చేరుకునే ప్రమాదం కూడా ఉందని గోల్డ్‌మన్ సక్స్ హెచ్చరించింది. దాదాపు 84 శాతం మేర తమ చమురు అవసరాలు తీర్చుకుంటున్న భారత్‌కు ఇది అన్ని విధాలుగా కలిసొచ్చే పరిణామంగా చెబుతున్నారు. దీనివల్ల చమురు దిగుమతుల బిల్లు తగ్గడంతోపాటు దేశీయంగా పెట్రోలు ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.
చమురు ధరలు తగ్గడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యం నుంచి బయటపడి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు 70.59కి చేరుకుంది. గత ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు పెట్రోలు ధర ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి. అలాగే డీజిల్ రేటు కూడా లీటరు 63.26కు చేరుకుంది.